Share News

దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాటాలు

ABN , Publish Date - Feb 12 , 2025 | 01:09 AM

దోపిడీ వర్గాలకు, బూర్జువా పార్టీలకు వ్యతిరేకంగా పోరాటాలు సాగిస్తామని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్‌ వెస్లీ అన్నారు. మంగళవారం చౌటుప్పల్‌లో సీపీఎం జిల్లా కమిటీ సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాటాలు

సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్‌ వెస్లీ

చౌటుప్పల్‌ టౌన్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యో తి): దోపిడీ వర్గాలకు, బూర్జువా పార్టీలకు వ్యతిరేకంగా పోరాటాలు సాగిస్తామని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్‌ వెస్లీ అన్నారు. మంగళవారం చౌటుప్పల్‌లో సీపీఎం జిల్లా కమిటీ సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ బూర్జువా పార్టీలని, బీజేపీ అత్యంత ప్రమాదకరమైన మతోన్మాద పార్టీగా పరిగణిస్తామన్నారు. బీజేపీని అడ్డుకోవడమే సీపీఎం లక్ష్యమని, పేద ప్రజలకు అండగా ఉం టామన్నారు. ప్రజా పోరాటాలతోనే పార్టీ బలపడుతుందని, ప్రత్యామ్నాయంగా ఎదుగుతామన్నారు. రాష్ట్ర మహాసభల్లో 42 అంశాలపై చర్చించామని, వీటిపై పోరాటాలకు సన్నద్ధమవుతున్నామని వివరించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ బిల్లు అసెంబ్లీలో పెట్టాలని, ఈ విషయంలో కాంగ్రెస్‌ తప్పించుకోవాలని చూస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో కాం గ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని, లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికా క తప్పదని హెచ్చరించారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధుల కేటాయింపుల్లో విఫలమైన బీజేపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు వెం టనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌లకు జాతీయ హోదాను కల్పించ లేదని, మూసీ ప్రక్షాళన ఊసే ఎత్త లేదని విమర్శించారు. పెట్టుబడిదారులను పెంచి పోషించేలా కేంద్ర బడ్జెట్‌ ఉందన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు మాట్లాడు తూ, రామరాజ్యం పేరుతో చిలుకూరు బాలాజీ దేవాలయం పూజారిపై దాడి అమానుషమని ఖండించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌, నాయకులు బూర్గు కృష్ణారెడ్డి, ఎండి.పాషా, పొట్ట శ్రీనివాస్‌, గోశిక కరుణాకర్‌, గంగదేవి సైదులు, దండ అరుణ్‌కుమార్‌, ఎ.రామేశ్వరీ, శారద, పల్లె మధు కృష్ణ, చీరిక సంజీవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2025 | 01:09 AM