ఆరు గ్యారెంటీలను అమలు చేయాలి
ABN , Publish Date - Jan 12 , 2025 | 01:07 AM
ఆరు గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వెంటనే అమలుచేయాలని బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు.

తుంగతుర్తి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : ఆరు గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వెంటనే అమలుచేయాలని బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో ఆరు గ్యారెంటీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలను అమలుచేయడంలో నిర్లక్ష్యం చేస్తోందన్నారు. రైతుభరోసా కింద వెంటనే రూ.15వేలు ఇవ్వాలని, రుణమాఫీ పూర్తి చేయాలన్నారు. మహిళలకు రూ.2500 ఇవ్వాలని, ఆసరా పింఛన్లను రూ.4000, కల్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం ఇవ్వాలన్నారు. రాస్తారోకో సందర్భంగా ఓ కార్యకర్త పార్టీ కండువాలను ధరించి వినూత్నంగా నిరసన తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు గుండగాని రాములుగౌడ్, దొంగరి శ్రీనివాస్, మట్టిపల్లి శ్రీశైలం, గాజుల యాదగిరి, నాగయ్య, లకావత దశరథ, వీరన్న, విజయ్, హరిబాబు, లింగయ్య, సూర్యప్రకా్‌షలు తదితరులు పాల్గొన్నారు.