కొండగడపలో విషాద ఛాయలు
ABN , Publish Date - Jan 18 , 2025 | 01:09 AM
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మునిసిపాలిటీ పరిధిలోని కొండ గడప గ్రామానికి చెందిన శ్యామ్‌శెట్టి కృష్ణమూర్తి కు టుంబం మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంతో చిన్నాభిన్నమైంది.

మోత్కూరు, జనవరి 17: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మునిసిపాలిటీ పరిధిలోని కొండ గడప గ్రామానికి చెందిన శ్యామ్‌శెట్టి కృష్ణమూర్తి కు టుంబం మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంతో చిన్నాభిన్నమైంది. కృష్ణమూర్తి కుటుంబం 12 ఏళ్ల క్రితం బతుకు దెరువు కోసం హైదరాబాద్ వెళ్లి సరూర్‌నగర్‌లోని గ్రీనపార్కు ఏరియాలో కిరా ణం దుకాణం నడుపుకుంటూ జీవనం సాగి స్తున్నారు. ఈ నెల 16న రాత్రి షిర్డీ-ఔరంగాబాద్ రూట్‌లో గంగాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణ మూర్తి భార్య ప్రేమలత, పెద్ద కూతురు తొలుపు నూరి ప్రసన్నలక్ష్మి, మనుమరాలు (కూతురు బిడ్డ) తొలుపునూరి అక్షిత, మనుమడు (కుమారుడి కొడు కు) అక్కడికక్కడే మృతి చెందారు. కృష్ణమూర్తి, కుమా రుడు వెంకన్న, అల్లుడు తొలుపునూరి శ్రీనివాస్, మనుమరాలు (కూతురు బిడ్డ) శరణ్య తీవ్రం గా గాయపడి ఔరంగాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొం దుతున్న విషయం తెలిసిందే. మృత దేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధు వులకు అప్పగించారు. మృతదేహాలను శుక్రవారం వారి స్వగ్రామం కొండగడపకు తీసుకవచ్చారు.
బంగారం, డబ్బులు అపహరణ
రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్క డికక్కడే మృతి చెంది, మరో నలుగురు తీవ్రంగా గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించే క్రమంలో కొందరు వ్యక్తులు తమ చేతివాటం ప్రదర్శించారు. మహిళల మెడలో ఉన్న సుమారు ఆరేడు తులాల బంగారు ఆరణాలు, మంగళసూత్రాలు, చేతి వేళ్ల ఉంగరాలు కొట్టేశారని చెబుతున్నారు. ఒకరి జేబు లో ఉన్న రూ.13,500 కూడా కొట్టేశారంటున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా ప్రేమలతపై నుంచి పోయిన బంగారు ఆభరణాలను మాత్రం రికవరీ చేశారని చెబుతున్నారు. ఆరేడు సెల్‌ఫోన్లు కూడా పోయాయన్నారు.
ఆగిన అంత్యక్రియలు
కృష్ణమూర్తి భార్య ప్రేమలత, కుమార్తె ప్రసన్నలక్ష్మి, మనుమరాలు అక్షిత, మనుమడు వైద్విక్ మృత దేహాలను పోస్టుమార్టం అనంతరం శుక్ర వారం ఉదయం కొండగడప గ్రామానికి తరలిం చారు. ప్రేమలత భర్త కృష్ణ మూర్తి, కుమారుడు వెంకన్న, మరో మృతురాలు ప్రసన్న లక్ష్మి భర్త శ్రీనివాస్, కుమార్తె శరణ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో వారు కడసారి చూ సు కోవడానికి వచ్చేందుకు ప్రయత్నిస్తుండటంతో మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించకుండా ఆపారు. మృతదేహాలను ఐస్‌బాక్సుల్లో పెట్టారు. శుక్రవారం రాత్రి వరకు వారెవరూ కొండ గడపకు చేరుకోలేదు.
హృదయాల కలచివేత
ప్రేమలత, ప్రసన్నలక్ష్మి, అక్షిత మృతదేహాలను ఐస్‌బాక్సుల్లో ఉంచి కృష్ణమూర్తి ఇంటి వాకిట్లో వరు సగా ఉంచారు. ఆరు నెలల చిన్నారి వైద్విక్ మృత దేహాన్ని నానమ్మ శవం పక్కన పెట్టడంతో ఆ దృ శ్యం చూసే వారిని కంటతడిపెట్టించింది. గ్రామ స్థులు భారీగా తరలివచ్చి అక్కడి దృశ్యాన్ని చూసి కంటతడిపెట్టారు. కొండగడప గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎమ్మెల్యే మందుల సామేలుతో పాటు పలు రాజకీయ పార్టీల నాయ కులు వచ్చి వారి మృతి పట్ల సంతాపం తెలిపి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాద సంఘటనపై సమగ్ర విచారణ జరిపి ప్రమాదానికి కారణమైన వారిపై చర్య తీసుకోవాలని, పోయిన నగలు, డబ్బు రికవరీ చేసి అప్పగించాలని, మహా రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు తగిన ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆ కుటుంబాలను ఆదుకో వాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.