స్కాన చేయండి..అభిప్రాయం చెప్పండి
ABN , Publish Date - Jan 17 , 2025 | 12:10 AM
సేవలు, సాయం, పరిష్కారం కోసం చాలామంది ఏదో ఒక సందర్భంలో పోలీ్‌సస్టేషన్లను సందర్శిస్తుంటారు.

నూతన విధానాన్ని అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ పోలీసు శాఖ
అభిప్రాయాలకు, మార్పులకు, ఫిర్యాదులకు క్యూఆర్ కోడ్
(ఆంధ్రజ్యోతి-భువనగిరి టౌన)
సేవలు, సాయం, పరిష్కారం కోసం చాలామంది ఏదో ఒక సందర్భంలో పోలీ్‌సస్టేషన్లను సందర్శిస్తుంటారు. అయితే కొన్నిచోట్ల బాధితులకు ఆశించిన స్థాయిలో సహాయసహకారాలు, న్యాయం లభిస్తుండగా మరికొన్ని స్టేషన్లలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉంటున్నాయి. అలాగే కొద్దిమంది పోలీస్ సిబ్బందితో సహా అధికారుల వరకు బాధితుల ఫిర్యాదులను బాధ్యతాయుతంగా స్వీకరిస్తుండటంతో పాటు మర్యాదగా మాట్లాడటం సమస్యలను సానుకూలంగా వింటూ పరిష్కారంపై భరోసా కల్పిస్తున్నారు. మరికొందరు సిబ్బంది లేదా అధికారులు స్టేషనకు వచ్చే నిస్సాహాయులతో అవమానకరంగా మాట్లాడంతో పాటు పలు కారణాలతో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికే సాయం చేసేందుకు ఉత్సుకత చూపుతుంటారు. దీంతో న్యాయం జరిగిన వారు పోలీస్ సిబ్బంది, అధికారుల మంచితనాన్ని ప్రశంసించాలన్నా, మోసపోయినవారు ఫిర్యాదులు చేయాలనుకున్నా లేక మార్పులకోసం సూచనలు చేయాలనుకున్నా పోలీస్ శాఖలో ఇప్పటివరకు సరైన వేదికలేదు. అయినప్పటికీ అధికారులకు నేరుగా లేదా రాతపూర్వకంగా అర్జీలు, ఫిర్యాదులు చేస్తే స్వీకరిస్తారో లేదో, స్వీకరించినా వ్యక్తిగతంగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని అందరిలో అనుమానాలు ఉండేవి. దీంతో పోలీసు శాఖపై ప్రశంసలనైనా, విమర్శలనైనా తమలోనే దాచుకునేవారు. ఈ నేపథ్యంలో పోలీసులలో జవాబుదారితనం, మార్పులు లక్ష్యంగా తెలంగాణ పోలీస్ సిటిజన ఫీడ్‌బ్యాక్ క్యూఆర్‌కోడ్ అమల్లోకి తెచ్చింది. తెలంగాణ పోలీసు సేవలపై ప్రజల అభిప్రాయం, మేము మీ అభిప్రాయానికి విలువ ఇస్తాం, ట్యాగ్‌లైనతో రూపొందించిన సిటిజన ఫీడ్ బ్యాక్ క్యూఆర్ కోడ్ పోస్టర్‌ను పోలీసు ఉన్నతాధికారులు ఇటీవల విడుదల చేశారు. ప్రతీ పోలీ్‌సస్టేషన, ఆపై స్థాయి పోలీసుఅధికారుల కార్యాలయాల్లో ఈ పోస్టర్‌ను అందుబాటులో ఉంచారు. క్యూఆర్‌కోడ్ ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులతో పాటు నాణ్యమైన సలహాలు కూడా వస్తాయని పోలీసు అధికారులు భావిస్తున్నారు.
క్యూఆర్ కోడ్‌తో ఇలా...
సిటిజన ఫీడ్ బ్యాక్ క్యూఆర్ కోడ్ ద్వారా పోలీసు శాఖకు సూచనలు, సలహాలు, ఫిర్యాదులు ఇవ్వాలనుకునేవారు తమ స్మార్ట్‌ఫోన ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన చేయాలి. స్కాన చేసిన వెంటనే ప్రత్యేక పేజీ తెరచుకుంటుంది. తెలుగు లేదా ఇంగ్లీ్‌షలో తమ వివరాలను నమోదు చేసిన అనంతరం ఐదు అంశాలపై అభిప్రాయాలను తెలిపే వీలుంటుంది. ఇందులో పోలీ్‌సస్టేషనలో ఇచ్చిన దరఖాస్తు ఎఫ్‌ఐఆర్, పాస్‌పోర్ట్ ఈ-చలానా తదితర అంశాలపై తమ అభిప్రాయాలను తెలపవచ్చు. క్యూఆర్ కోడ్ ద్వారా అభిప్రాయాలు హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సర్వర్‌కు చేరుతాయి. అక్కడి నుంచి సంబంధిత అధికారులు ఆయా పోలీ్‌సస్టేషన్లలో ఆరా తీసి వాస్తవాలను నిర్ధారించుకుని బాధితులకు న్యాయం చేస్తారు. విలువైన అభిప్రాయాలను, సూచనలను స్వీకరిస్తూ మార్పు కోసం ప్రయత్నిస్తారు. పోలీస్ సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యం తేలితే చర్యలకు బాధ్యులను చేస్తారు.
ఉమ్మడి జిల్లాలో
రాచకొండ పోలీస్‌కమిషనరేట్ పరిధిలోని యాదాద్రిభువనగిరి జిల్లాలో యాదాద్రి జోన డీసీపీ కార్యాలయం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఎస్పీ కార్యాలయాలు, మూడు జిల్లాల్లో 10కి పైగా ఏసీపీ, డీఎస్పీ కార్యాలయాలు, 15వరకు సీఐ కార్యాలయాలు, 70వరకు పోలీ్‌సస్టేషన్లు ఉన్నాయి. అన్నిస్థాయిల అధికారుల కార్యాలయాలు, పోలీ్‌సస్టేషన్లలో సందర్శకుల గదుల్లో సిటిజన ఫీడ్‌బ్యాక్ క్యూఆర్ కోడ్ పోస్టర్ అందుబాటులో ఉండనుంది. త్వరలోనే ప్రధాన కూడళ్లలోనూ క్యూఆర్‌కోడ్ పోస్టర్లను ఏర్పాటు చేయనున్నారు.