నీళ్లు వదిలి పంటలను కాపాడాలి
ABN , Publish Date - Jan 17 , 2025 | 12:21 AM
ఎస్సారెస్పీ ద్వారా నీటిని వదిలి వానాకాలం పంటలను ఆదుకోవాలని బీఆర్‌ఎస్ మండల నాయకుడు గాడ్థుల లింగరాజు కోరారు.

నూతనకల్, జనవరి 16 (ఆంధ్రజ్యోతి) : ఎస్సారెస్పీ ద్వారా నీటిని వదిలి వానాకాలం పంటలను ఆదుకోవాలని బీఆర్‌ఎస్ మండల నాయకుడు గాడ్థుల లింగరాజు కోరారు. గురువారం మండలంలోని ఎర్రపహాడ్ గ్రామశివారులోని ఎస్సారెస్పీ కాల్వలో నీటిని విడుదల చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వేసవిలోనూ నీటిని విడుదల చేసి పంటలను కాపాడిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఎమ్మెల్యే సామేలు స్పందించి నీటిని విడుదల చేయించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఇరుగు అంజయ్య, నారాయణ, అనిల్, లింగయ్య, రామస్వామి, మల్లయ్య, భిక్షం, అశోక్, శ్రీను ఉన్నారు.