సాగర్ బుద్ధవనం మహాద్భుతం
ABN , Publish Date - Jan 25 , 2025 | 12:38 AM
ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం మహా అద్భుతంగా ఉందని ఎయిర్‌ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సభ్యులు అన్నారు.

ఎయిర్‌ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సభ్యులు
నాగార్జునసాగర్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి) : ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం మహా అద్భుతంగా ఉందని ఎయిర్‌ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సభ్యులు అన్నారు. రాష్ట్రంలో నూతన విమానాశ్రయ నిర్మాణంలో భాగంగా నాగార్జునసాగర్ రైట్‌బ్యాంక్ పరిధిలో స్థలపరిశీలన కోసం శుక్రవారం సాగర్‌కు వచ్చారు. ఈ సందర్భంగా బుద్ధవనాన్ని సందర్శించారు. బుద్ధుడి పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. చరితవనం, స్థూపవనం, ధాన్యవనం, జాతక వనం, మహాస్థూపంలను తిలకించారు. కార్యక్రమంలో ఏఎ్‌సఎన మూర్తి, అజయ్‌కుమార్, అర్వింద్ తివారి, శిబి చక్రవర్తి, బాబు, డీకే మిశ్రా ఉన్నారు. వారికి బుద్ధవనం విశేషాలను పర్యాటక శాఖ గైడ్ సత్యనారాయణ వివరించారు. వారి వెంట ఆర్‌ఐ శ్రీనివా్‌సరెడ్డి, నిరంజన తదితరులు ఉన్నారు.