Share News

బ్రెయినసో్ట్రక్‌తో ఆర్టీసీ కండక్టర్‌ మృతి

ABN , Publish Date - Jan 22 , 2025 | 12:22 AM

బ్రెయిన సో్ట్రక్‌తో సూర్యాపేట జిల్లా కోదాడ ఆర్టీసీ డిపో మహిళా కండక్టర్‌ మంగళవారం మృతి చెందింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

బ్రెయినసో్ట్రక్‌తో  ఆర్టీసీ కండక్టర్‌ మృతి
కనకమ్మ(ఫైల్‌ఫొటో)

మేళ్లచెర్వు, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): బ్రెయిన సో్ట్రక్‌తో సూర్యాపేట జిల్లా కోదాడ ఆర్టీసీ డిపో మహిళా కండక్టర్‌ మంగళవారం మృతి చెందింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నేరేడుచర్ల మండలం సోమారం గ్రామానికి చెందిన పెదపంగు కనకమ్మ(48) కోదాడ ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తుంది. భర్త మేళ్లచెర్వులోని మైహోంలో పనిచేస్తూ అక్కడే కాలనీలో వారు ఉంటున్నారు. సోమవారం ఉదయం విధి నిర్వహణ ముగించుకుని రాత్రి మేళ్లచెర్వు మండలం మైహోంకాలనీలోని ఇంటికి చేరుకుంది. అనంతరం ఆమె బ్రెయినసో్ట్రక్‌కు గురై ఇంట్లోనే మృతి చెందింది. మృతురాలి స్వగ్రామం సోమారం మంగళవారం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. అప్పటివరకు విధులు నిర్వహించి ఉల్లాసంగా ఉన్న కనకమ్మ మృతి చెందటంతో ఆమె స్వగ్రామం, మైహోంకాలనీ, ఆర్టీసీ డిపోలో తీవ్ర విషాధం నెలకొంది. ఆమె మృతికి డిపో అధికారులు, మైహోం సిబ్బంది సంతాపం తెలిపారు. కనకమ్మకు భర్తతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.

Updated Date - Jan 22 , 2025 | 12:22 AM