Share News

క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోవాలి

ABN , Publish Date - Feb 05 , 2025 | 12:10 AM

ప్రాణాంతక క్యాన్స ర్‌ మహమ్మారిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని డిప్యూటీ డీఎంహెచ్‌వో శిల్పిని అన్నారు. మంగళవారం బీబీనగర్‌ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా క్యాన్సర్‌ నివారణకు సం బంధించిన కరపత్రాలను విడుదల చేశారు.

క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోవాలి

డిప్యూటీ డీఎంహెచ్‌వో శిల్పిని

బీబీనగర్‌, భువనగిరి రూరల్‌, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): ప్రాణాంతక క్యాన్స ర్‌ మహమ్మారిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని డిప్యూటీ డీఎంహెచ్‌వో శిల్పిని అన్నారు. మంగళవారం బీబీనగర్‌ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా క్యాన్సర్‌ నివారణకు సం బంధించిన కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గుట్కా మద్యపానం, దూమపానానికి దూరంగా ఉండి క్యాన్సర్‌ను తరిమికొట్టాలన్నారు. ప్రజలు ఆరోగ్య అలవాట్లు, ఆహారంపైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్యకరమైన అలవాట్లతో వివిధ రకాల వ్యాధులతోపాటు క్యాన్సర్‌ను కూడా దరిచేరకుండా జాగ్రత్త పడవచ్చన్నారు.

నోటిక్యాన్సర్‌, బ్రెస్ట్‌ క్యాన్సర్‌, గొంతు సర్వైకల్‌, గర్భాశయ క్యాన్సర్‌లు గుట్కా, దూమపానం, మద్యపానం సేవించడంవల్ల క్యాన్సర్‌కు దారి తీస్తాయన్నారు. క్యాన్సర్‌ నిరోధకానికి హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉందని, 16 నుంచి 60 ఏళ్లు గల ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలన్నారు. వైద్యసిబ్బంది గ్రామీణ ప్రాంతాల ప్రజలకు క్యాన్సర్‌పై అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా భువనగిరి మండలం బొల్లేపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో బీబీనగర్‌లో మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ మౌనికరెడ్డి, ఎంఎల్‌హెచ్‌పీ వైద్యులు డాక్టర్‌ సుష్మా, భవాని, మన్మోహన్‌, జ్యోత్స్న, పీహెచ్‌ఎన్‌ ఆరోగ్యమ్మ, హెల్త్‌ సూపర్‌వైజర్‌ పద్మ, శాంతకుమారి, భువనగిరిలో వైద్యాధికారి యామిని, శృతి, సిబ్బంది సురేశ్‌, జేవీఎన్‌ రెడ్డి, మురళీ, స్టాఫ్‌ నర్సులు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

Updated Date - Feb 05 , 2025 | 12:10 AM