Share News

రేషన బియ్యం వ్యాపారిపై పీడీ యాక్ట్‌

ABN , Publish Date - Jan 04 , 2025 | 12:13 AM

కొన్నేళ్లుగా జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించుకొని రేషన బియ్యం సేకరించి ఆంధ్ర ప్రదేశకు తరలిస్తున్న వ్యక్తిపై నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు పీడీ యాక్ట్‌ నమోదు చేశారు.

రేషన బియ్యం వ్యాపారిపై పీడీ యాక్ట్‌
నర్సింహారావుకు డీఎస్పీ రాజశేఖర్‌రాజు సమక్షంలో డిటెన్షన ఆర్డర్‌ను అందజేస్తున్న సీఐ వీరబాబు

మిర్యాలగూడ అర్బన, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): కొన్నేళ్లుగా జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించుకొని రేషన బియ్యం సేకరించి ఆంధ్ర ప్రదేశకు తరలిస్తున్న వ్యక్తిపై నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. డీఎస్పీ రాజశేఖర్‌రాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ రాష్ట్రం దాచేపల్లి మండలకేంద్రానికి చెందిన మందపాటి నర్సింహారావు కొన్నేళ్లుగా జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకుని రేషన బియ్యం సేకరించి ఏపీకి తరలిస్తున్నాడు. 2015 నుంచి రేషన బియ్యం దందా చేస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. మిర్యాలగూడ సబ్‌డివిజన పరిధిలోని పలు పోలీ్‌సస్టేషన్ల పరిధిలో నర్సింహారావుపై పదుల సంఖ్యలో కేసులు నమోదుకావడంతో రౌడీషీట్‌ తెరిచినట్లు చెప్పారు. గతేడాది నవంబర్‌ 17వ తేదీన నర్సింహారావును అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించగా, 19 రోజుల పాటు జైలులో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చాడు. అనంతరం తీరు మారకుండా రేషన బియ్యం దందా కొనసాగిస్తున్నాడు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తుండటంతో జిల్లా ఎస్పీ శరతచంద్రపవార్‌ ఆదేశాల మేరకు పీడీ యాక్ట్‌ నమోదు చేసి శుక్రవారం అదుపులోకి తీసుకుని చంచల్‌గూడ జైలుకు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడిని పట్టుకున్న మిర్యాలగూడరూరల్‌ సీఐ వీరబాబును డీఎస్పీ అభినందించారు.

Updated Date - Jan 04 , 2025 | 12:13 AM