నేత్రపర్వం.. గోదాదేవి కల్యాణం
ABN , Publish Date - Jan 14 , 2025 | 01:11 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ధనుర్మాసోత్సవాల్లో భాగంగా సోమవారం గోదాదే వి, శ్రీరంగనాథస్వామి కల్యాణ వేడుకలు నేత్రపర్వంగా సాగాయి. శ్రీనృసింహుడిని శ్రీరంగనాథుడి గా, గోదాదేవిగా ఆండాల్ అమ్మవారిని పట్టువస్త్రా లు, బంగారు, ముత్యాల ఆభరణాలతో అలంకరించి ప్రత్యేకసేవల్లో తీర్చిదిద్దారు.

నేడు ఆండాళ్ అమ్మవారికి ఒడి బియ్యం సమర్పణ
అధ్యయనోత్సవాల్లో శ్రీరంగనాథుడిగా నృసింహుడు
భువనగిరి అర్బన్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి) : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ధనుర్మాసోత్సవాల్లో భాగంగా సోమవారం గోదాదే వి, శ్రీరంగనాథస్వామి కల్యాణ వేడుకలు నేత్రపర్వంగా సాగాయి. శ్రీనృసింహుడిని శ్రీరంగనాథుడి గా, గోదాదేవిగా ఆండాల్ అమ్మవారిని పట్టువస్త్రా లు, బంగారు, ముత్యాల ఆభరణాలతో అలంకరించి ప్రత్యేకసేవల్లో తీర్చిదిద్దారు. విశ్వక్సేనుడికి తొలిపూజ అనంతరం కల్యాణతంతు నిర్వహించారు. వేదపండితులు నిర్ణయించిన సుముహూర్తమున గోదాదేవి అమ్మవారి మెడలో స్వామి వారు మాంగళ్యధారణ చేశారు. పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో జరిగిన వేడుకలను ప్రధానార్చకులు నల్లందీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు సారథ్యంలో అర్చకబృందం వైభవంగా నిర్వహించింది.
అధ్యయనోత్సవాల్లో వెన్న కృష్ణుడిగా..
అధ్యయనోత్సవాల్లో భాగంగా రామానుజల అవతరణ, స్వామివారి అలంకార సేవ నిర్వహించారు. భక్తాగ్రేసరులు నమ్మాళ్వార్లు పరమపదించి, మళ్లీ రామానుజ ఆళ్వారుగా అవతరించి, వైకుంఠనాధుడి తో పాటు భక్తులతో పూజలు అందుకునే ఘట్టం సంప్రదాయరీతిలో వైభవంగా నిర్వహించారు. నా ల్గో రోజుకు చేరిన అధ్యయనోత్సవాల్లో సోమవారం ఉదయం 9గంటలకు వెన్నకృష్ణుడిగా సాయంత్రం ఆరుగంటలకు కాళీయమర్ధనుడి అలంకరణలో స్వా మివారికి తిరువీధి సేవ నిర్వహించారు. ముందుగా ఆళ్వారాచార్యులకు స్నపన తిరుమంజనాలు నిర్వహించి లక్ష్మీనృసింహుడిని శ్రీరంగనాథుడిగా అలంకరించి ఊరేగించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ ఈవో భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త భాస్కరాయణీ నరసింహమూర్తి, డీఈవో దోర్భల భాస్కరశ ర్మ, ఏఈవో నవీన్, పర్యవేక్షకులు మహేష్, రామరా వు,ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
కల్యాణ వే డుకలలో భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. పాతగుట్టలోనూ గోదాదేవి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది.
నేడు ఒడి బియ్యం సమర్పణ
గోదాదేవి కల్యాణం తర్వాత రోజున అమ్మవారికి భక్తులు ఒడిబియ్యం సమర్పించడం ఆలయ సంప్రదాయం. మంగళవారం అమ్మవారికి ఒడి బియ్యం సమర్పణలతో 30రోజులుగా అత్యంత వైభవంగా కొనసాగిన ధనుర్మాస ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ ప్రధానార్చకులు తెలిపారు.