ప్రజా సమస్యలపై ఉద్యమించాలి
ABN , Publish Date - Feb 23 , 2025 | 12:15 AM
దివంగత కం దాళ రంగారెడ్డి పోరా ట స్ఫూర్తితో ప్రజా సమస్యలపై ఉద్యమించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ కోరారు. చౌటుప్పల్ పట్టణంలోని కందాళ రం గారెడ్డి స్మారక భవనంలో శనివారం సీపీఎం ఆధ్వర్యంలో రంగారెడ్డి 40 వ వర్ధంతి నిర్వహించారు.

సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్
చౌటుప్పల్ టౌన్, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): దివంగత కం దాళ రంగారెడ్డి పోరా ట స్ఫూర్తితో ప్రజా సమస్యలపై ఉద్యమించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ కోరారు. చౌటుప్పల్ పట్టణంలోని కందాళ రం గారెడ్డి స్మారక భవనంలో శనివారం సీపీఎం ఆధ్వర్యంలో రంగారెడ్డి 40 వ వర్ధంతి నిర్వహించారు. రంగారెడ్డి స్మారక స్థూపానికి బొంతల చంద్రారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బూరుగు కృష్ణారెడ్డితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా జహంగీర్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సీపీఎంను పటిష్టం చేయడంలో రంగారెడ్డి పోషించిన పాత్ర చిరస్మరణీయమన్నారు. పోరాటాలతోనే సమస్యలను పరిష్కరించుకోవాలని, రంగారెడ్డి గ్రామ, గ్రామాన ప్రజలను సమీకరించి ఉద్యమాల బాట పట్టించారన్నారు. కార్యక్రమంలో సీపీఎం మండల, పట్టణ కార్యదర్శులు గంగదేవి సైదులు, గోశిక కరుణాకర్, జిల్లా కమిటీ సభ్యులు ఎండి.పాషా, రాగీరు కిష్టయ్య, మాజీ సర్పంచ్‌లు జక్కిడి రామ్‌రెడ్డి, భీమిడి ప్రభాకర్ రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ చీరిక సంజీవరెడ్డి, నాయకులు దండ అరుణ్‌కుమార్, శ్రీనివాస్, బోయ యాదయ్య, తడక మోహన్, బొజ్జ బాలయ్య, చింతల సుదర్శన్, చీరిక అలివేలు, నందగిరి వసంత పాల్గొన్నారు.