ఎస్సీ వర్గీకరణతోనే మాదిగలకు న్యాయం
ABN , Publish Date - Jan 22 , 2025 | 12:43 AM
ఎస్సీ వర్గీకరణతోనే మాదిగలు, దాని ఉప కులాలకు న్యాయం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యద ర్శి బోయ లింగస్వామి అన్నారు.
చౌటుప్పల్ టౌన, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణతోనే మాదిగలు, దాని ఉప కులాలకు న్యాయం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యద ర్శి బోయ లింగస్వామి అన్నారు. హైదరాబాద్‌లో వచ్చే నెల 7 వ తేదీన నిర్వహించే లక్ష డప్పులు- వేయి గొంతుల కార్యక్రమాన్ని విజమవంతం చేయాలని, ఈ నెల 26వ తేదీన చౌటుప్పల్ పట్టణంలో 100 డప్పులతో నిర్వహించనున్న ప్రధర్శన కార్యక్రమానికి సంబందించి మంగళవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో డప్పు కళాకారుల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ తో పాటు చౌటుప్పల్ పట్టణంలో నిర్వహించే డప్పుల కమిటీలను ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా ఉబ్బు ఉపేందర్, ప్రధాన కార్యదర్శిగా నక్క మహేష్, సాంస్కృక కార్యదర్శి గా బర్రె సుధాకర్, మునిసిపల్ అధ్యక్షుడిగా బద్రి గాలయ్యలను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో డప్పుల కమిటీ జిల్లా అధ్యక్షుడిగా మీసాల గణేష్, ఊదరి వెంకటేశ, బొడ్డు శ్రావణ్, ఎర్ర శకర్ పాల్గొన్నారు.