ప్రేమ కరుణతో కలిసిమెలిసి ఉండాలి
ABN , Publish Date - Jan 17 , 2025 | 12:22 AM
అందరూ ప్రేమ, కరుణ కలిగి సోదరభావంతో, దైవభక్తితో కలిసిమెలిసి ఉండాలని నల్లగొండ మహాగణ కరణం ధమనకుమార్ అన్నారు.

మేళ్లచెర్వు, జనవరి 16 (ఆంధ్రజ్యోతి) : అందరూ ప్రేమ, కరుణ కలిగి సోదరభావంతో, దైవభక్తితో కలిసిమెలిసి ఉండాలని నల్లగొండ మహాగణ కరణం ధమనకుమార్ అన్నారు. మండలకేంద్రంలోని ఆర్‌సీ ఎం చర్చి శతవసంతాల వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన భక్తులనుద్దేశించి మాట్లాడారు. చర్చి ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటుచేసిన గర్భగుడిలో విగ్రహ పునఃప్రతిష్ట వేడుకను గ్రామస్థుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు. అంతకుముందు గ్రామ పురవీధుల నుంచి భారీఊరేగింపుతో చర్చి ప్రాంగణానికి చేరుకున్న ధమనకుమార్ చర్చిలో నూతనవిగ్రహాలను ప్రతిష్ఠించారు. అనంతరం మహాఅన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ 100 వసంతాల వేడుకల్లో సుమారుగా వివిధ చర్చిల నుంచి 100 మంది మతగురువులు, 50 మంది నన్స, దేవాలయ పెద్దలు, భక్తులు, విచారణ గురువులు తమ్ము ఇన్నారెడ్డి పాల్గొన్నారు.