Share News

కాంగ్రెస్‌లో లొల్లి..లొల్లి

ABN , Publish Date - Feb 03 , 2025 | 12:26 AM

తుం గతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పాత, కొత్త వర్గాల పంచాయతీ ముదిరి పాకాన పడింది.

కాంగ్రెస్‌లో లొల్లి..లొల్లి

ముదిరిన కాంగ్రెస్‌ పాత, కొత్త వర్గాల పంచాయితీ

మోత్కూరు, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): తుం గతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పాత, కొత్త వర్గాల పంచాయతీ ముదిరి పాకాన పడింది. ఆరేడు నెలలుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న పార్టీ అంతర్గత వర్గ విభేదాలు మోత్కూరుకు చెందిన సీనియర్‌నేత పైళ్ల సోమిరెడ్డిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జిల్లా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడిగా నియమించడం, తనకు తెలియకుండా తన నియోజకవర్గంలోని వారికి పదవులు ఎలా ఇస్తారంటూ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు సోమిరెడ్డి నియామకాన్ని వ్యతిరేకించడంతో అంతర్గత కలహాలు బహిర్గతమయ్యా యి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఆటుపోట్లను, ప్రభుత్వ నిర్భందాలను తట్టుకుని కాంగ్రె్‌సను బతికించుకున్న సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుల ను ఎమ్మెల్యే సామేలు పక్కన బెట్టి, ఆయన ఎన్నికలప్పుడు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు కోసం పనిచేసిన వారిని చేరదీస్తున్నారని, వారికే ప్రా ధాన్యమిస్తున్నారని పలువురు సీనియర్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. అలాంటిదేమిలేదని తా ను అందరిని కలుపుకుని పోతున్నానని, సీనియర్లకు తగిన ప్రాధాన్యమిస్తున్నానని ఎమ్మెల్యే సామేలు అంటున్నారు. సీనియర్‌ నాయకుల్లో నూ కొందరు ఎమ్మెల్యే పనివిధానాన్ని వ్యతిరేకిస్తుండగా, మరికొందురు సమర్ధిస్తున్నారు.

ఇదిలా ఉండగా అర్వపల్లి మండలానికి చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు యోగానందచార్యులు గత అక్టోబరు 5న అర్వపల్లిలో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులతో సమావేశం ఏర్పాటు చేయగా సమావేశానికి అనుమతి లేదంటూ పోలీసులు నాడు కాంగ్రెస్‌ నాయకులను ముం దస్తు అరెస్టు చేసి నూతనకల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించి సమావేశం జరుగకుండా చేశారని సీనియర్‌ నాయకులు చెప్పారు. ఎమ్మెల్యే సామేలు చెప్పడం వల్లే పోలీసులు అలా చేశారని వారంటున్నారు.

పీసీసీ అధ్యక్షుడి దృష్టికి సమాచారం

తుంగతుర్తిలో కాంగ్రెస్‌ రాజకీయ పరిస్థితిని పీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌ దృష్టికి తీసుకెళ్లగా నియోజకవర్గంలో కోఆర్డినేషన్‌ కమి టీ వేయిస్తానని చెప్పారని, అది నేటి వరకు కార్యరూపం దాల్చలేదంటున్నారు. ఇటీవల మో త్కూరు మునిసిపాలిటీకి చెందిన ఓ మాజీ కౌన్సిలర్‌ను ఎమ్మెల్యే సామేల్‌ పార్టీలో చేర్చుకో గా, కాంగ్రెస్‌ మోత్కూరు మండల అధ్యక్షుడు వంగాల సత్యనారాయణ ఆయన చేరికను తాము అంగీకరించడం లేదని ప్రకటించారు. ఇలా కాంగ్రెస్‌ పాత, కొత్త వర్గాల మధ్య విభేదా లు కొనసాగతున్నాయి. కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షు డు అండెం సంజీవరెడ్డి ఇటీవల మోత్కూరు సీనియర్‌ నాయకుడు సోమిరెడ్డిని మంత్రి వెంకట్‌రెడ్డి సూచన మేరకు జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించగా తన నియోజకవర్గంలోని వారికి తనకు తెలియకుండా పదవులు ఎలా ఇస్తారం టూ ఎమ్మెల్యే సామేలు మంత్రి వెంకట్‌రెడ్డిని ప్రశ్నించారు. ఆ సందర్భంగా వారిరువురి మధ్య కొంత వాగ్వాదం జరిగినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే సోమిరెడ్డికి, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ నాగరిగారి ప్రీతంకు, ఇటీవల నూతనంగా ఎన్నికైన యూత్‌ కాంగ్రెస్‌ నియోజకవర్గ, మండల అధ్యక్షులకు సన్మానం పేరుతో ఈ నెల 3న మోత్కూరు ఎల్‌ఎన్‌ గార్డెన్‌లో కాంగ్రెస్‌ మోత్కూరు మండల అధ్యక్షుడు వంగాల సత్యనారాయణ, మార్కెట్‌ మాజీ చైర్మన్‌ వల్లంభట్ల పూర్ణచందర్‌రావు, లక్ష్మీదేవికాల్వ మాజీ సర్పంచ్‌ నారగోని అంజయ్య తదితరులు కాంగ్రెస్‌ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు. మోత్కూరులో నాయకులకు సన్మానం పేరుతో కొందరు నాయకులు నిర్వహించనున్న సభకు కాంగ్రెస్‌కు సంబంధం లేదని పార్టీ సీనియర్‌ నాయకులు, అడ్డగూడూరు మండల అధ్యక్షుడు పోలెబోయిన లింగయ్యయాదవ్‌, మోత్కూరు మార్కెట్‌ వైస్‌చైర్మన్‌ లింగాల నర్సిరెడ్డి, అడ్డగూడూరు సింగిల్‌ విండో చైర్మన్‌ కొప్పుల నిరంజన్‌రెడ్డి తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని లింగయ్యయాదవ్‌ ఆదివారం అడ్డగూడూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హెచ్చరించారు. మోత్కూరు సమావేశానికి ఎమ్మెల్యే పట్ల అసంతృప్తితో ఉన్నవారిని సమీకరిస్తున్నట్టు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ పంచాయితీ ఎటు దారి తీస్తుందోనని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Feb 03 , 2025 | 12:26 AM