Share News

జిల్లాలో నాలుగు ఎత్తిపోతల పథకాలకు భూసేకరణ

ABN , Publish Date - Jan 30 , 2025 | 12:20 AM

జిల్లాలోని నాలుగు కొత్త ఎత్తిపోతల పథకాలకు భూసేకరణ పనులు పూర్తిచేయాలని రాష్ట్ర భూసేకరణ ఆర్‌ఆండ్‌ఆర్‌ కమిషనర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు.

జిల్లాలో నాలుగు ఎత్తిపోతల పథకాలకు భూసేకరణ
కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌పవార్‌తో కలిసి మాట్లాడుతున్న రాష్ట్ర భూసేకరణ ఆర్‌ఆండ్‌ఆర్‌ కమిషనర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

సూర్యాపేట(కలెక్టరేట్‌), జనవరి 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని నాలుగు కొత్త ఎత్తిపోతల పథకాలకు భూసేకరణ పనులు పూర్తిచేయాలని రాష్ట్ర భూసేకరణ ఆర్‌ఆండ్‌ఆర్‌ కమిషనర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో కలెక్టర్‌ తేజ్‌సనందలాల్‌ పవార్‌తో కలిసి ఇరిగేషన అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మంజూరైన నాలుగు ఎత్తిపోతల పథకాలైన బెట్టతండా ఎత్తిపోతల, పాలకవీడు మండలం రాజీవ్‌గాంధీ ఎత్తిపోతల, చింతలపాలెం మండలం రెడ్లకుంట ఎత్తిపోతల, కోదాడ మండలం ఉత్తమ్‌ పద్మావతి ఎత్తిపోతల, అనంతగిరి మండలానికి ఎత్తిపోతల పథకాలు మంజూరయ్యాయని తెలిపారు. వీటి కోసం భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేసి ఇరిగేషన శాఖకు అప్పగించాలని ఆదేశించారు. ఇరిగేషన అధికారులు ఎత్తిపోతల పథకాల పనులు త్వరగా చేపట్టి, పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ రాంబాబు, ఇరిగేషన ఎస్‌ఈ శివధర్మతేజ, ఈఈ కోదాడ సత్యనారాయణ, ఈఈ హుజూర్‌నగర్‌ రామకిశోర్‌, డీఐవో ప్రేమ్‌చంద్‌, భూసేకరణవిభాగం సూపర్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ ఆకాష్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2025 | 12:20 AM