Share News

లేబర్‌కోడ్‌లను రద్దు చేయాలి

ABN , Publish Date - Feb 06 , 2025 | 12:40 AM

కార్మికుల నష్టం చేసే లేబర్‌కోడ్‌లు, ప్రజలకు నష్టం చేసే వ్యవసాయ నల్ల చట్టాలను రద్దుచేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లూరు రాజయ్య, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ.ఇమ్రాన్‌ డిమాండ్‌ చేశారు.

లేబర్‌కోడ్‌లను రద్దు చేయాలి

యాదగిరిగుట్ట రూరల్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): కార్మికుల నష్టం చేసే లేబర్‌కోడ్‌లు, ప్రజలకు నష్టం చేసే వ్యవసాయ నల్ల చట్టాలను రద్దుచేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లూరు రాజయ్య, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ.ఇమ్రాన్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం గుట్టలో కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జాయింట్‌ ఫ్లాట్‌ ఫామ్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్స్‌, ఎస్‌కెఎం జాతీయ కమిటి పిలుపు మేరకు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చి మోదీ ప్రభుత్వం కార్మికులకు ఉపయోగపడే 29 కార్మిక చట్టాలను రద్దుచేసి పరిశ్రమ యజమానుల కోసం నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకవచ్చిందని, వెంటనే వాటిని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, సమానపనికి సమానవేతనం ఇవ్వాలని , అధిక ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గోరేటి రాములు, కార్మిక సంఘాల నాయకులు గందమల్ల మాతయ్య, పుప్పాల గణేష్‌, చెక్క రమేష్‌, గోపగాని రాజు, జోగు శ్రీను, మంగ వెంకటేష్‌, శ్రీశైలం, మధు, కళ్లెం సిద్దులు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ పత్రాలు దహనం

మోత్కూరు : సీపీఎం అనుబంధ సంఘాల రాష్ట్ర కమిటి పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బుధవారం సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మోత్కూరు అంబేడ్కర్‌ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బొల్లు యాదగిరి మాట్లాడు తూ కేంద్ర బడ్జెట్‌ పేదల పొట్టకొటి, ధనికుల జేబులు నింపేలా ఉందన్నారు. నాయకులు రాచకొండ రాములమ్మ, గుండు లక్ష్మీ, కూరపాటి రాములు, కూరెల్ల నర్సింహ, ఎండీ.లతీఫ్‌, మేడి శ్రీను, రోశయ్య, కృష్ణ, ముత్తయ్య. అభినయ్‌ పాల్గొన్నారు.

ఆలేరు: పట్టణంలోని రైల్వే గేటు చౌరస్తాలో రైతు సంఘాల నాయకులు నిరసన తెలిపారు. ప్రజా సంఘాల నాయకులు ఆర్‌ జనార్థన, మామిడాల సోమయ్య, భిక్షపతి, ఎక్బాల్‌, మంగ నర్సింహులు, కొల్లూరు రాజయ్య, ఉప్పలయ్య, గడ్డం నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - Feb 06 , 2025 | 12:40 AM