Share News

కొత్త కోర్సులతో ఉద్యోగావకాశాలు

ABN , Publish Date - Feb 08 , 2025 | 12:57 AM

పెరిగిన సాంకేతిక అవసరాలకు అనుగుణంగా ఐటీఐలను అడ్వాన్స టెక్నాలజి సెంటర్స్‌ (ఏటీసీ)గా ఆధునికరించి విద్యార్థులకు వైట్‌ కాలర్‌ ఉద్యోగాలు లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన పథకానికి జిల్లాలోని భువనగిరి, ఆలేరు ప్రభుత్వ ఐటీఐలు ఎంపికైన విషయం విదితమే.

కొత్త కోర్సులతో ఉద్యోగావకాశాలు

ఆలేరు ఏటీసీలో పూర్తయిన ప్రవేశాలు

భువనగిరిలో వచ్చే విద్యా సంవత్సరంనుంచి..

భువనగిరి టౌన, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): పెరిగిన సాంకేతిక అవసరాలకు అనుగుణంగా ఐటీఐలను అడ్వాన్స టెక్నాలజి సెంటర్స్‌ (ఏటీసీ)గా ఆధునికరించి విద్యార్థులకు వైట్‌ కాలర్‌ ఉద్యోగాలు లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన పథకానికి జిల్లాలోని భువనగిరి, ఆలేరు ప్రభుత్వ ఐటీఐలు ఎంపికైన విషయం విదితమే. అయితే మొదటి దశలో ఆలేరు ఐటిఐలో ప్రతిపాదిత ఆరు నూతన కోర్సులు ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే ప్రారంభం కాగా భువనగిరి ఐటిఐలో మాత్రం మరుసటి విద్యాసంవత్సరంలో ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి. కాగా కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న భవనాలు రెండు ఐటీఐల్లోనూ నిర్మాణ దశలోనే ఉన్నా యి. ఆలేరులోని ప్రస్తుత ఐటీఐ భవనంలో తాత్కాలికంగా ఏటీసీ కోర్సులను ప్రారంభించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి భువనగిరి, ఆలేరులోనూ నూతన భవనాలు అందుబాటులోకి రానున్నాయి.

సంప్రదాయ, ఆధునిక కోర్సులు..

ఐటీఐ అంటే సాధారణంగా ఫిట్టర్‌, ఎలకీ్ట్రషియన, వెల్డర్‌, మెకానిక్‌ తదితర సంప్రదాయ కోర్సులు, మహిళా ఐటీఐలో టైలరింగ్‌, ఎంబ్రాయిడింగ్‌ తదితర కోర్సులు గుర్తుకు వస్తాయి. అయితే కొద్ది కాలం క్రితం సోలార్‌, ఐఓటి టెక్నీషియన, సీవోపీఏ తదితర కోర్సులను ప్రవేశపెట్టారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక పాలసీలో భాగంగా ఐటీఐలను ఏటీసీగా అభివృద్ది చేసే లక్ష్యంతో టాటా సంస్థతో టై అప్‌ అయ్యింది. ఈ మేరకు భువనగిరి, ఆలేరు ఐటిఐలలో ప్రస్తుత, భవిష్యత్తు సాంకేంతిక అవసరాలను తీర్చేలా రెండు సంవత్సరాల కోర్సులు మూడు, ఒక సంవత్సరం కోర్సులు మూడు ప్రవేశ పెట్టారు. అయితే మొదటి ధశలో ఎంపికైన ఆలేరు ఏటిసిలో ప్రస్థుత విద్యా సంవత్సరం ప్రవేశాలు పూర్తయ్యాయి. ఆరు కోర్సులలో 216 సీట్లకు గాను మెజార్టీ సీట్లు భర్తీ కాగా మిగితా సీట్లు ఖాళీగా ఉన్నాయి. ప్రవేశాలకోసం ఐటీఐ సిబ్బంది విస్తృతంగా ప్రచారం కూడా నిర్వహించారు. అయితే ప్రతిపాదిత భవన నిర్మాణం పనులు ఇంకా పూర్తి కాక పోవడంతో పాత భవనంలోనే నూతన కోర్సులను నిర్వహిస్తున్నారు. భవన నిర్మాణం పూర్తి కాకపోవడంతో పూర్తి స్థాయి శిక్షణా సామాగ్రిని వినియోగించలేని పరిస్థితి. అలాగే నలుగురు ఇనిస్ట్రక్టర్స్‌కు గాను ప్రస్తుతం ఇద్దరే ఉండగా మిగతా రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

నూతన కోర్సులతో ఉద్యోగావకాశాలు..

ప్రస్తుత ఐటీఐలు, కోర్సులు యదావిధిగా కొనసాగుతున్నాయి. అయితే ఏటీసీ పేరిట ప్రవేశ పెడుతున్న నూతన కోర్సులతో శిక్షణ పూర్తయిన వెంటనే సులభంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. శిక్షణ చివరిదశలో ఉండగానే క్యాంపస్‌ సెలక్షన్సద్వారా ఇంటర్న్‌షి్‌ప ఆ తరువాత ప్రతిభ ఆధారంగా శాశ్వత ఉద్యోగాలు లభించనున్నాయి. ఇందు కోసం ప్రభుత్వం 12 మల్టీ నేషనల్‌ కంపెనీలతో ఒప్పందం కదుర్చుకుంది. ఎటీసీలన్నిటిలో పూర్తిస్థాయి వసతులు, నియామకాలు పూర్తి చేసి నూతన కోర్సులపై విద్యార్థులు, యువతకు అవగాహన కల్పిస్తే ప్రవేశాలు పెరగడంతో పాటు వారి భవిష్యత్తుకు భధ్రత లభించనుంది.

Updated Date - Feb 08 , 2025 | 12:57 AM