Share News

జాతరకు వేళాయే

ABN , Publish Date - Feb 15 , 2025 | 12:50 AM

రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతర దురాజ్‌పల్లి లింగ మం తుల స్వామి జాతర రేపటి (ఆదివారం) నుంచి ప్రా రంభం కానున్నది. భక్తులకు అసౌకర్యం కలుగకుండా అధి కారులు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజ రుకానున్నారు.

 జాతరకు వేళాయే

(ఆంధ్రజ్యోతి,సూర్యాపేట కలెక్టరేట్‌)

లింగమంతులస్వామి పెద్ద(గొల్ల)గట్టు జాత ర రేపు ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. సూర్యాపేట సమీపంలో జాతీయ రహదారి 65 పక్కనే ఉన్న లింగమంతుల స్వామి గుట్ట వద్ద ఈనెల 16 నుంచి 20వ వరకు ఐదు రోజుల పా టు జాతర కొనసాగనుంది. రెండేళ్లకోసారి జాతర నిర్వహిస్తారు. ఈ జాతరకు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు విచ్చేస్తారు. తెలంగాణ నుంచి కాక ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీ్‌సఘడ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి భక్తులు విచ్చేసి లింగమంతుల స్వా మికి మొక్కులు చెల్లించుకోనున్నారు. ప్రధానంగా యా దవులు, గిరిజనులు పెద్ద సంఖ్యలో హాజరుకా నున్నారు. నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలతో పాటు ఖమ్మం, వరంగల్‌, రంగారెడ్డి, మహ బూబ్‌నగర్‌, కృష్ణా జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చి గొర్రెలు, మేక పోతుల, కోళ్లను బలి ఇస్తారు.

జాతరకు సౌకర్యాలు

జాతరకు 15 లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని గతంలో తాగునీటి కోసం, వంటలు చేయడానికి, కనీస అవసరాలకు నీటి కోసం నీటితొట్లను మరమ్మత్తు చేయించి వాటిలో నీటిని నింప నున్నారు. కోనేరు సమీపంలో మహిళలకు ప్రత్యేకంగా గదులను ఉపయోగంలోకి తీసు కొచ్చారు. తాత్కాలిక మరుగుదొడ్లు, భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి కుళాయిలు ఏర్పాటు చేశారు. గుట్టపై వేలాది గొర్రెలు బలి ఇస్తుండడంతో గుట ్టపై అపరిశుభ్రంగా ఉండ కుండా జెట్టింగ్‌ మిషన్‌ను ఏర్పాటు చేశారు.

దిష్టిపూజతో ఆరంభం

ప్రతిసారి జాతర ముందు సూర్యాపేట మండలం కేసారం గ్రామం నుంచి దేవత విగ్రహాలను తీసు కొచ్చి దిష్టిపూజ నిర్వహిస్తారు. దిష్టిపూజ ప్రారంభం నుంచి జాతర ముగిసే వరకు ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కళకళాడుతుంది. భక్తి శ్రద్ధ్దలతో నైవేద్యాలు, బోనాలు, పసు పు, కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ఆదివారం అర్థరాత్రితో ప్రారంభమయ్యే లింగమంతులస్వామి జాతర ఐదు రోజుల పాటు ఎంతో వైభవంగా జరగనుంది.

దద్దరిల్లనున్న బేరీ చప్పుళ్లు

జాతర సందర్భంగా ఓలింగ...ఓలింగా.. అం టూ భక్తులు పెద్ద ఎత్తున జాతరలో సందడి చేస్తారు. దేవాలయ ప్రాంతమంతా ఓ లింగ.. లింగా నామస్మరణతో మార్మోగుతుంది ఆలయ పరిసరాలు భేరీ చప్పుళ్లు, గజ్జెల లాగుల మోత తో దద్దరిల్లుతుంది. వీటితో పాటు యాదవులు కటారుల విన్యాసాలు ఆకట్టుకోనున్నాయి.

ప్రతి పని మర్రి చెట్టు కిందే నిర్ణయం

గుట్ట కింద భాగంలో కొన్ని వందేళ్ల చరిత్ర కల్గిన మర్రిచెట్టు వేల మంది భక్తులకు నీడనిస్తుంది. మర్రి చెట్టు విశిష్టత గురించి వచ్చిన భక్తులు కథలు కథలుగా చెప్పుకుంటారు. గుట్ట చుట్టూ తీరిక లేకుండా తిరిగిన భక్తులకు మర్రి చెట్టు ఉపశమనం కలిగిస్తుంది. గుట్టపైన ఏర్పా టు చేసిన చలువ పందిళ్ల కంటే మర్రి చెట్టు నీడ అమోఘం. గుట్టపైన జరిగే ప్రతి పని చెట్టు కిం దనే నిర్ణయాలు జరుగుతాయి.

పటిష్ఠ బందోబస్తు

జాతర ప్రారంభం కానున్నందున శాంతి భద్రతల దృష్ట్యా పోలీసు సిబ్బంది పటిష్ట బందోబస్తు ను ఏర్పాటు చేస్తున్నారు. జాతరకు వచ్చే భక్తుల కు పలు శాఖల అధికారులు ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

పారిశుధ్యంపై ప్రత్యేక నిఘా.

పెద్దగట్టుపైన, గుట్ట కింద భాగంలో మున్సిపాలిటీ అధికారులు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకు పారిశుధ్య కార్మికులను మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించనున్నారు.

దీని కోసం కార్మికులను 90శాతం జాతరకు కేటాయించినట్లు సమాచారం.

జాతరకు సర్వం సిద్ధం : కలెక్టర్‌

దురాజ్‌పల్లి వద్ద పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు అన్ని ఏర్పాట్లు సిద్ధ చేశామని జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ తెలిపారు. జాతర ఏర్పాట్లపై శుక్రవారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మా ట్లాడారు. జాతరకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామన్నారు. పారిశుధ్య నిర్వహణకు మూడు షిప్టుల్లో షిప్టుకు 130 మంది చొప్పున సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. విద్యుత్‌ అంతరాయం లేకుండా 110 మంది విద్యుత్‌ అధికారులు 9 ప్రాంతాల్లో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసి పర్యవేక్షించనున్నట్లు వివరించారు. మిషన్‌ భగీరథ ప్రధాన పైప్‌లైన్‌ ద్వారా పెద్దగట్టు పైన, కింది భాగంలో ప్రత్యేక నీటి ట్యాంకులు ఏర్పాటు చేసి తాగునీటిని అందించనున్నట్లు స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 24 మంది వైద్యులు, 190 మంది వైద్య సిబ్బంది 8ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసుకుని విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. వీరితో పాటు మూడు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. భక్తుల సౌకర్యార్దం ఆర్టీసీ ఆధ్వర్యంలో 60 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామన్నారు. నాణ్యత లేని ఆహార పదార్దాలు విక్రయించకుండా ఉండేందుకు ఫుడ్‌ కమిటీలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జాతరలో ఎలాంటి సమస్యలు తలెత్తినా సూర్యాపేట ఆర్డీవో, జాతర నోడల్‌ ఆఫీసర్‌ వేణుమాధవ్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమావేశం లో అదనపు కలెక్టర్‌ రాంబాబుతో కలిసి పెద్దగట్టు చైర్మన్‌ పోలెబోయిన నర్సయ్యయాద వ్‌, సీపీవో కిషన్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ కోటాచలం, డీఎస్పీ జి.రవి, మునిసిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, తహసీల్దార్లు కృష్ణయ్య, శ్యాంసుందర్‌రెడ్డి, దేవాలయ ఈవో కుశలయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2025 | 12:50 AM