Share News

అంతర్రాష్ట్ర బైక్‌ దొంగ అరెస్ట్‌

ABN , Publish Date - Jan 17 , 2025 | 12:09 AM

పార్కింగ్‌ చేసిన ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగను నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు అరెస్ట్‌ చేశారు. డీఎస్పీ రాజశేఖర్‌రాజు తన కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సపమావేశంలో వివరాలు వెల్లడించారు.

అంతర్రాష్ట్ర బైక్‌ దొంగ అరెస్ట్‌
మిర్యాలగూడలో విలేకరులకు వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ రాజశేఖర్‌రాజు, వెనక ఇద్దరు నిందితులు(ముసుగులో)

మిర్యాలగూడ అర్బన, జనవరి 16 (ఆంధ్రజ్యోతి) : పార్కింగ్‌ చేసిన ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగను నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు అరెస్ట్‌ చేశారు. డీఎస్పీ రాజశేఖర్‌రాజు తన కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సపమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ రాష్ట్రం పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయి జంక్షన గ్రామానికి చెందిన శీలం నాగరాజు నెంబర్‌ప్లేట్‌ లేకుండా బుల్లెట్‌పై వస్తుండగా అద్దంకి- నార్కట్‌పల్లి రహదారిపై ఫ్లైఓవర్‌ వంతెన వద్ద టూటౌన పోలీసులకు పట్టుబడ్డాడు. అతడి వద్ద ఉన్న బుల్లెట్‌ ఇంజన ఛాసిస్‌ నెంబర్లను తనిఖీచేయగా ఏపీ07డీజడ్‌ 7888 నెంబర్‌గా తేలిందని డీఎస్పీ తెలిపారు. దీంతో సదరు నిందితుడు నాగరాజును అదుపులోకి తీసుకొని విచారించామన్నారు. రెండేళ్లుగా నాగరాజు ఏపీలోని నర్సారావుపేట, వినుకొండ, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతాల్లో తిరుగుతూ పార్క్‌ చేసిన ద్విచక్రవాహనాలను దొంగిలించి విక్రయానికి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నాడని తెలిపారు. నాగరాజు దొంగిలించిన వాహనాలను మిర్యాలగూడ పట్టణంలోని ఇందిరమ్మకాలనీకి చెందిన మునుకుంట్ల కృష్ణకు తక్కువ ధరకు విక్రయించినట్లు తేలిందన్నారు. ఇప్పటివరకు ఐదు ద్విచక్రవాహనాలను చోరీ చేయగా, అందులో నాలుగు పల్సర్‌ ద్విచక్రవాహనాలను కృష్ణ విక్రయించినట్లు డీఎస్పీ తెలిపారు. పోలీసులకు పట్టుబడిన బుల్లెట్‌ వాహనం టూటౌన పరిధిలో దొంగిలించబడ్డ వాహనంగా గుర్తించామన్నారు. అదేవిధంగా నిందితుడు విక్రయించిన సుమారు రూ.6లక్షల విలువైన నాలుగు ద్విచక్రవాహనాలను ఇందిరమ్మకాలనీకి చెందిన కృష్ణ నుంచి స్వాధీన పర్చుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. నిందితులిద్దరిపై కేసునమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. కొన్నేళ్లుగా ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్న నిందితుడిని చాకచక్యంగా పట్టుకొని బైక్‌చోరీ కేసుల పరిష్కారానికి కృషి చేసిన టూటౌన సీఐ నాగార్జున, ఎస్‌ఐలు హరీ్‌షరెడ్డి, రాంబాబు, ఏఎ్‌సఐ వెంకటేశ్వర్లు, పీసీలు బాలకృష్ణ, కళ్యాణ్‌, సాయిరెడ్డిలను డీఎస్పీ అభినందించారు.

Updated Date - Jan 17 , 2025 | 12:09 AM