నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
ABN , Publish Date - Mar 05 , 2025 | 01:26 AM
జిల్లాలో సోమవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ నెల 5 నుంచి 22వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. జిల్లావ్యాప్తంగా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 6,208 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

సెల్‌పోన్, ఎలకా్ట్రనిక్ గాడ్జెట్లకు అనుమతి లేదు
29 కేంద్రాలు, 12,558 మంది విద్యార్థులు
ప్రతీ కేంద్రంలో సీసీ కెమెరాలు
భువనగిరి (కలెక్టరేట్), మార్చి 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ నెల 5 నుంచి 22వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. జిల్లావ్యాప్తంగా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 6,208 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ద్వితీయ సంవత్సరానికి 6,350 మంది, మొత్తం 12,558 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, 29 కేంద్రాలను ఏర్పాటుచేశారు. ప్రతీ కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులను నియమించారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనుండగా, విద్యార్థులు 15 నిమిషాలముందే కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. పరీక్షా కేంద్రాల లోపలికి ఎలాంటి ఎలకా్ట్రనిక్ గాడ్జెట్, మొబైల్ ఫోన్లకు అనుమతి లేదు. పరీక్షల నిర్వహణ సమయంలో కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉం టుంది. కేంద్రాలకు పరిసరాల్లో ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసి వేయిస్తా రు. విద్యార్థులు ఎలాంటి మానసిక ఆందోళనకు గురికాకుండా ప్రశాంతం గా పరీక్షలు రాయాలని, ఏవైనా ఇబ్బందులు ఎదురైతే టెలీమానస్ టోల్ ఫ్రీనెం.14416లో సంప్రదించాలని ఇంటర్ జిల్లా అధికారి రమణి కోరారు.