భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలి
ABN , Publish Date - Mar 04 , 2025 | 12:23 AM
మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకొని భావితరాలకు అందించాలని జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానం పీఠాధిపతి శ్రీవిద్యాశంకర భారతిమహాస్వా మి అన్నారు.సో
సూర్యాపేటటౌన,మార్చి 3(ఆంధ్రజ్యోతి):మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకొని భావితరాలకు అందించాలని జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానం పీఠాధిపతి శ్రీవిద్యాశంకర భారతిమహాస్వా మి అన్నారు.సోమవారం జిల్లా కేంద్రంలోని శ్రీసంతోషిమాత దేవాలయం లో జీవధ్వజయంత్ర పునఃప్రతిష్ఠా మహోత్సవంలో ఆయన మాట్లాడారు. దేవాలయంలో భగవంతుడికి ప్రతిరూపంగా,దేవాలయానికి నాభిలా ధ్వం జస్తంభం ఉంటుందన్నారు. భగవంతుడు తన శక్తినంతా ధ్వజస్తంభం లో లీనం చేస్తాడన్నారు. ప్రతి ఒక్కరిలో భక్తిభావం పెంపొందించేలా దే వాలయాలు ఉంటున్నాయన్నారు. ప్రపంచ దేశాలు ఎంతగానో ఆచరించే మన దేశ సంస్కృతిని ప్రతి ఒక్కరూ భావితరాలకు అందించాలన్నారు. అంతకుముందు దేవాలయంలో మంటప ఆవాహన దేవతల పూజలు, హోమం, జపం, రుద్రహోమం, మంగళనీరాజనం నిర్వహించారు.
దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి
రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తోందని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు, పబ్లిక్‌క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఎంఎల్‌ఆర్‌గు ప్తా, పానుగంటి చంద్రమౌళి, దేవాలయం అధ్యక్ష, కార్యదర్శులు నూక వెంకటేశంగుప్తా,బ్రహ్మండ్లపల్లి మురళీదర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.