జోరుగా ఇసుక అక్రమ దందా
ABN , Publish Date - Feb 01 , 2025 | 12:29 AM
కొండమల్లేపల్లి మండలంలో జోరుగా ఇసుక దందా నడుస్తోంది. ఇసుక బుకింగ్ ఆన్‌లైన్ సైట్ పని చేయకపోవడంతో అక్రమ రవాణాదారులు అనుకూలంగా మలుచు కున్నారు.
(కొండమల్లేపల్లి -ఆంధ్రజ్యోతి)
మండలంలో జోరుగా ఇసుక దందా నడుస్తోంది. ఇసుక బుకింగ్ ఆన్‌లైన్ సైట్ పని చేయకపోవడంతో అక్రమ రవాణాదారులు అనుకూలంగా మలుచు కున్నారు. దేవరకొండ డివిజన్ పరిధిలోని తాటికోల్, ముదిగొండ, మైనంపల్లి వాగుల నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఇందుకు ప్రజా ప్రతినిధులు, అధికారుల అండ దండలు పుష్కలంగా ఉండడంతో అక్రమరవాణా జరుగుతోందని వినికిడి. ప్రభుత్వం అనుమతించిన గొట్టిముక్కల వాగు రిచ్‌లో ఇసుక లేకపోవడంతో దీంతో ఆన్‌లైన్ దాదాపు నెల రోజుల నుంచినిలిపివేశారు. దీంతో ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్ కాకపోవడంతో ఇసుక రాకపోవడంతో నిర్మాణ దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అదునుగా భావించిన ఇసుక అక్రమ రవాణాదారులు ఒక్కో ట్రాక్టర్‌కు దాదాపు రూ.5 నుంచి 6 వేల వరకు వసూ లు చేస్తున్నారు. అలాగే దుబార ఇసుక(సన్న ఇసుక) ఒక్కో ట్రాక్టర్‌కు రూ.10 నుంచి రూ.12వేల వరకు విక్రయిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఇసుక రాకపోవ డంతో నిర్మాణదారులు చేసేది లేక మధ్యవర్తులను ఆశ్ర యించి అధిక డబ్బులు చెల్లించి ఇసుక రవాణా చేయించుకుంటున్నారు. దీంతో దాదాపు రోజుకు ఒక కొండమల్లేపల్లి మండల కేంద్రానికి దాదాపుగా 20 నుంచి 30 ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా తరలిస్తు న్నారు. నియోజకవర్గం మొత్తంలో ఎన్ని ట్రాక్టర్లు తర లిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది.
లైట్లు లేకుండానే ట్రాక్టర్లు
అక్రమంగా ట్రాక్టర్లో ఇసుకను తరలించే రవాణా దారులు తెల్లవారుజామున 4 గంటల సమయంలో దేవరకొండ నుంచి కొండమల్లేపల్లికి అక్రమ ఇసుక రవాణా తరలించే క్రమంలో చోరీ విషయం బయటకు వస్తుందని, ట్రాక్టర్లకు లైట్లు ఆపి అతి వేగంతో వచ్చే క్రమంలో ఉదయం స మయంలో వాకింగ్ చేసే వ్యక్తులు లైట్లు లేకుండా లైన్లుగా వచ్చే ట్రాక్టర్లను చూసి భయాందోళనకు గురవుతున్నారు. ఈ అతివేగంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరు గుతుందోనని ఆందోళన వ్యక్తం చేసు ్తన్నారు. ఇసుక అక్రమ రవాణా దేవ రకొండ పోలీస్‌స్టేషన్ ముందు నుంచే కొండమల్లేపల్లికి వస్తున్న అధి కారులు తమకేమీ పట్టన్నట్లుగా వ్యవహరిస్తు న్నారు. అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణా దారులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, నిర్మాణ దారులు కోరుతున్నారు. లేదంటే ప్రభుత్వ ఆదా యానికి గండి పడడమే కాకుండా ప్రమా దాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
ఇసుక అక్రమంగా తరలిస్తే చర్యలు
ఇసుకను అక్రమంగా తరలిస్తే చట్టరీత్య చర్యలు తీస ుకుంటాం, అక్రమ రవాణా విషయాన్ని కొండమల్లేపల్లి పోలీ సుల దృష్టికి తీసుకెళ్లి అక్రమ ఇసుక రవాణాను అడు ్డకుంటాం.
- అన్వర్ హుస్సేన్, తహసీల్దార్, కొండమల్లేపల్లి