Share News

ఎత్తి పోసేదెలా?

ABN , Publish Date - Feb 07 , 2025 | 12:31 AM

ఎత్తిపోతల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో రైతులకు ఇబ్బందులకు తప్పడం లేదు. పాలకులు మారుతున్నా వారు చేసిన వాగ్దానాలు మాత్రం అమలు కాకపోవడంతో ఎత్తిపోతల నిర్వహణ నిత్యం సమస్యల్లోనే కొన సాగుతోంది.

 ఎత్తి పోసేదెలా?

మండలంలోని తిమ్మారెడ్డిగూడెం, మొల్కపట్నం, శెట్టిపాలెం, పచ్చారిగడ్డ గ్రామ శివారు లోని సుమారు 1,152 ఎకరాలకు నీరందించేందుకు మిర్యాలగూడ మండల శివారులోని పచ్చారిగడ్డ సమీపంలో నాగార్జున సాగర్‌ ఎడమకాల్వపై ఎల్‌-16(శ్రీ లక్ష్మీన రసింహా స్వామి) ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేశారు. రెండున్నర నెలల క్రితం ఎల్‌-16 ఎత్తిపోతలకు విద్యుత్‌ సరఫరా చేసే 500కేవీ సామర్ధ్యం గల ట్రాన్స్‌ ఫార్మర్‌ మరమ్మతుకు గురికాగా లిఫ్ట్‌ వృఽథాగా పడి ఉంది. ఆయకట్టు తల భాగంలో సాగర్‌ ఎడమ కాల్వ నిండా నీరు ప్రవహిస్తున్నప్పటికీ పంట పొలాలకు నీరందే పరిస్థితి లేకపోవడంతో అన్నదాతలు ఆందో ళనకు గురవుతున్నారు. దీని సమీపంలోని ఎల్‌-17 వరద జలాలు, బోరుబావులు ఆధారంగా ఆయకట్టు కింద సాగు చేపడుతున్నప్పటికీ కొద్ది రోజులుగా ఎం డలు తీవ్రరూపం దాలుస్తుండడంతోపాటు వరి పొట్టదశకు చేరడంతో నీరందక పంటలు వాడిపట్టే దశకు చేరాయి. మరోవైపు ఎత్తిపోతల నీరు అందక పోవడంతోపాటు భూగర్భజలాలు అడుగంటడడంతో బోరుబావులు ఆగిపోస్తుండడం రైతులను ఆందోళనకు గురి చేస్తుంది. అలాగే ఎల్‌-16 కాల్వ నీటితో గత కొంతకాలంగా జలకళలతో సంతరించుకున్న తిమ్మా రెడ్డిగూడెం పరిధిలోని జగ్గన్‌ చెరువుకు నీరందక ఒట్టిపోయింది. దీంతో సమీప బోరుబావుల పరిధిలో భూగర్భజలాలు తగ్గడంతో ఆగిపోస్తుండడంతో పంట ఎక్కడ చేతికందదోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ట్రాన్స్‌ ఫార్మర్‌కు మరమ్మతుల చేపట్టకపోవడంతో పంట చివరి దశలో ఎండిపోయి ఆర్ధికంగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంటుందని ఆయా గ్రామాల పరిధిలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టిసారించి ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేసి ఎత్తిపోతల ద్వారా నీటిని అందిం చేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

టెండర్‌ పూర్తయిన వెంటనే మరమ్మతులు చేపడుతాం

ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోవడంతో టెండర్‌ను పిలిచాం. నేడు టెండర్‌ ఓపెన్‌ పూర్తి కానున్నది. వెంటనే కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసే లా చర్యలు చేపట్టి లిఫ్ట్‌ పునరుద్ధరణ చేసి సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటాం.

-పాండునాయక్‌ , ఏఈ

Updated Date - Feb 07 , 2025 | 12:31 AM