ప్రేమ పెళ్లిళ్లపై పరువు కత్తి
ABN , Publish Date - Feb 03 , 2025 | 12:21 AM
ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీతో పరుగులు పెడుతున్నా సమాజంలోని కుల, మత, ఆర్థిక అంతరాలు మాత్రం తొలగడం లేదు. యువతీ యువకుల మధ్య చిగురిస్తున్న ప్రేమలకు ఇవి అడ్డుగోడగా నిలుస్తున్నాయి. పరువు పేరుతో ప్రేమ వివాహాలను పెద్దలు అంగీకరించడం లేదు.

అడ్డుపడుతున్న కులం, మతం, ఆర్థిక స్థోమతలు
అంగీకరించని తల్లిదండ్రులు
క్షక్ష పెంచుకొని హతమారుస్తున్న వైనం
ఆందోళన కలిగిస్తున్న పరువు హత్యలు
(ఆంధ్రజ్యోతి, సూర్యాపేటక్రైం) : ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీతో పరుగులు పెడుతున్నా సమాజంలోని కుల, మత, ఆర్థిక అంతరాలు మాత్రం తొలగడం లేదు. యువతీ యువకుల మధ్య చిగురిస్తున్న ప్రేమలకు ఇవి అడ్డుగోడగా నిలుస్తున్నాయి. పరువు పేరుతో ప్రేమ వివాహాలను పెద్దలు అంగీకరించడం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిత్యం రెండు నుంచి మూడు జంటలు ప్రేమ వివాహాలు చేసుకుంటుండగా, వీటిలో పెద్దలు అంగీకరించినవి కొన్నే ఉంటున్నాయి. అంతేగాక ప్రేమ పేరుతో కూతురిని దూరం చేశారని, సమాజంలో పరువు తీశారని తల్లిదండ్రులు కక్ష పెంచుకుంటున్నారు. ఫలితంగా పరువు హత్యలు చోటుచేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా సూర్యాపేట జిల్లాలో జరిగిన ఓ యువకుడి పరువు హత్య దీనికి నిదర్శనం.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పరువు హత్యలు కొనసాగుతున్నాయి. కుమార్తె, కుమారుడు ఇష్టం లేకుండా ప్రేమ, కులాంతర వివాహం చేసుకోవడం కొంత మంది తల్లిదండ్రులకు ఇష్టం ఉండడం లేదు. వారి సామాజికవర్గంలో వివాహం చేయాలని ఆశించిన వారికి ప్రేమ వివాహాలు రుచించడం లేదు. దీం తో కోపోద్రుక్తులై ప్రేమ వివాహం చేసుకున్న వారిని అంతమొందిస్తున్నారు. మాయ మాటలు చెప్పిన యువకుడి అంతమొందిస్తే తర్వాత కుమార్తె యథావిధిగా ఇంటికి వస్తుందని వారు భావిస్తున్నారు. కొన్నాళ్ల పాటు ఘటనను మర్చిపోయగా, వారిని ఇష్టమొచ్చిన వారికి కట్టబెడుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో సూర్యాపేటలో 2000లో కు లాంతర వివాహం చేసుకుందని ఓ వ్యాపారి యువకుడిని హత్య చేయించాడు. 2012లో తన కుమార్తె ను ప్రేమిస్తున్నాడని ఎంత చెప్పినా వినడంలేదని భావించిన వ్యక్తులు ప్రేమికుడిని హత్య చేశారు. అదే విధంగా యాదాద్రి జిల్లాలో నాలుగేళ్ల క్రితం లింగరాజుపల్లికి చెందిన తుమ్మల స్వాతి, పల్లెర్ల గ్రా మానికి చెందిన నరేష్ ప్రేమించుకున్నారు. వారి ప్రే మకు కులాలు అడ్డుకావడంతో తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో స్వాతి తల్లిదండ్రులు నరే్‌షను హత్య చేశారు. అది తట్టుకోలేక స్వాతి కూడా మనస్తాపంతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అదే విధంగా నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం గానుగవెల్లికి చెందిన యువకుడు పీఏపల్లి మండ లం పోల్కంపల్లికి చెందిన యువతిని ప్రేమించాడు. వాళ్లిద్దరు ప్రేమ వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి తండ్రి సంబంధిత పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయంలో పోలీసులు యువకుడి మందలించడం తో అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనను మరవకముందే మిర్యాలగూడెంలో ప్రేమ పేరుతో కు లాంతర వివాహం చేసుకుందనే పగతో వ్యాపారి మారుతీరావు తన కుమార్తె అమృతను ప్రేమ వివా హం చేసుకున్న దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రణయ్‌ను హత్య చేయించాడు. తాజా గా, సూర్యాపేటలో ఓ యువకుడు పరువు హత్యకు గుర య్యాడు.
ప్రేమిస్తే విభేదిస్తున్న తల్లిదండ్రులు
మేజర్ అయిన యువతీ, యువకులు ఒకరినొకరు అర్థం చేసుకొని కలకాలం కలిసి జీవించేందుకు ప్రేమించుకుంటున్నారు. ప్రేమ అనంతరం ఒకటవుతున్నారు. కానీ, వీరి ప్రేమను తల్లిదండ్రులు విభేదిస్తున్నారు. ప్రేమలు కేవలం వ్యామోహ ం, ఆకర్షణలని తిరస్కరిస్తున్నారు. ప్రేమ పేరుతో వివాహాలు చేసుకున్న వారు జీవితంలో ఉన్నతంగా స్థిరపడి న సందర్భాలు తక్కువగా ఉంటున్నాయని కొంత మంది తల్లిదండ్రులు ప్రేమ వి వాహాలను అంగీకరించడం లేదు. ప్రేమ వివాహం చేసుకుంటే చస్తామని మరి కొంత మంది తల్లిదండ్రులు బెదిరిస్తున్నారు.
అడ్డుపడుతున్న కులాలు, ఆర్థిక స్థోమతలు
ప్రేమ వివాహాలకు కులాలు, ఆర్థిక స్థోమతలు అడ్డుపడుతున్నాయి. తక్కువ, ఎక్కువ కులం అంటూ ప్రేమ వివాహాలకు పెద్దలు అంగీకరించడంలేదు. సమాజంలో పరువు పోతుందని కొంత మంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఆర్థిక స్థోమతలు కూడా అడ్డుపడుతున్నాయి. తమ స్థాయికి తగ్గ కుటుంబం కాదని విభేదిస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే ప్రేమ వివాహాలు చేసుకున్న యువతీ, యువకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికంగా నివాసం ఉండి జీవించలేక దూర ప్రాంతాలకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు.
పగ పెంచుకొని..
పిల్లల ప్రేమను జీర్ణించుకోలేని కొంత మంది పగతో రగిలిపోతున్నారు. ఇలాంటి తరుణంలోనే వారిని హతమార్చేందుకు వెనకాడడంలేదు. పలు సందర్భాల్లో ఇద్దరు ప్రేమికులను కూడా చంపేస్తున్నారు. కుమార్తెకు మాయమాటలు చెప్పి లొంగదీసుకొని సమాజంలో తలదించుకునేలా ప్రవర్తించాడని యువకులపై కోపం పెంచుకుంటున్నారు. దీంతో హత్యలు జరుగుతున్నాయి. తాజాగా, సూర్యాపేట మునిసిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రికి చెందిన బీసీ సామాజికవర్గానికి చెందిన యువతి సూర్యాపేటలో నివాసముండే దళిత సామాజిక వర్గానికి చెందిన యువకుడిని ప్రేమించి ఆరు నెలల కిత్రం వివాహం చేసుకుంది. ఈ వివాహం యువతి కుటుంబ సభ్యులకు నచ్చలేదు. దీంతో గ్రామంలో తమ పరువు పోయిందని దీనికి ప్రధాన కారణం యువతిని పెళ్లి చేసుకున్న యువకుడని భావించి అప్పటి నుంచి పగతో రగిలిపోయారు. ఎలాగైనా యువకుడిని అంతమొందించాలని నిర్ణయించుకుని ఈనెల 26న రాత్రి సమయంలో సూర్యాపేటలో వడ్లకొండ క్రిష్ణ అలియాస్ మాల బంటి అనే యువకుడిని యువతి కుటుంబ సభ్యులు హతమార్చారు.
ప్రేమ పెళ్లిళ్లను అంగీకరిస్తున్నది కొందరే
సమాజంలో జరిగే ప్రేమ వివాహాలను ఎవరో కొద్ది మంది మాత్రమే అంగీకరిస్తున్నారు. కులాలు వేరైనా ఆర్థికంగా బలోపేతంగా లేకున్న పిల్లలు ఇష్టపడ్డారని కొంత మంది తల్లిదండ్రులు వారి ప్రేమకు అడ్డు చెప్పడం లేదు. అవసరమైతే అవతలి వ్యక్తులను కూడా ఒప్పిస్తున్నారు. దగ్గర ఉండి ప్రేమ వివాహం కాకుండా కుదిర్చిన వివాహంలా పెళ్లి చేస్తున్నారు.
ఆందోళన కలిగిస్తున్న పరువు హత్యలు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరుగుతున్న పరువు హత్యలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ప్రేమ వివాహాలు చేసుకున్న యువతీ, యువకులు భయపడుతున్నారు. సమాజంలో జరుగుతున్న సంఘటనలు చూసి పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్న జంటలు ఆందోళన చెందుతున్నాయి. ప్రేమించి ఇష్టమైన వారిని పెళ్లి చేసుకోవడమే చేసిన నేరమా అని వారు వాపోతున్నారు. పరువు హత్యలకు సంబంధించి చట్టంలో సెక్షన్‌లు ఏవీ కూడా పోలీ్‌సస్టేషన్‌లో నమోదు చేయడంలేదు. సాధారణంగా హత్య కేసుకు సంబంధించిన సెక్షన్ల కిందనే ఈ కేసులు నమోదు చేసి రిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి కేసులు కోర్టుల్లో విచారణకు వచ్చిన సందర్భాలో ఎక్కువ శాతం శిక్షలు పడకుండా రాజీ అవుతున్న ఘటనలూ ఉన్నాయి.
ప్రేమ వివాహం చేసుకున్న కుటుంబీలకు అవగాహన కల్పిస్తున్నాం: సన్‌ప్రీత్‌సింగ్, సూర్యాపేట ఎస్పీ
ప్రేమ వివాహం చేసుకుని పోలీసులను ఆశ్రయించిన యువతీ, యువకుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. చట్టప్రకారం మేజర్లు అయిన యువతీ, యువకులు వివాహం చేసుకోవచ్చు. వారికి రక్షణ కల్పించే విషయంలో తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నాం. తమను కాదని ప్రేమ వివాహం చేసుకున్నారని కక్ష పెంచుకోవడం సరికాదు. నేరాలకు పాల్పడితే చట్టపరంగా కేసులు నమోదు చేసి కోర్టులో శిక్షలు పడే విధంగా చర్యలు చేపడతాం.