Share News

నిజాయితీగా బ్రాస్‌లెట్‌ అప్పగించాడు

ABN , Publish Date - Feb 26 , 2025 | 12:37 AM

నల్లగొండ జిల్లా చిట్యాలకు చెందిన ఓ క్షురకుడు ఒకటి, రెండు కాదు ఏకంగా రూ.3.5 లక్షల విలువైన బంగారు బ్రాస్‌లెట్‌ను అప్పగించి నిజాయితీని చాటుకున్నాడు.

నిజాయితీగా బ్రాస్‌లెట్‌ అప్పగించాడు
గణేష్‌కు బ్రాస్‌లెట్‌ అందజేస్తున్న అశోక్‌

చిట్యాల, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి) : నల్లగొండ జిల్లా చిట్యాలకు చెందిన ఓ క్షురకుడు ఒకటి, రెండు కాదు ఏకంగా రూ.3.5 లక్షల విలువైన బంగారు బ్రాస్‌లెట్‌ను అప్పగించి నిజాయితీని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్‌కు చెందిన గుర్రం గణేష్‌ సోమవారం చిట్యాలలో బంధువుల శుభకార్యానికి వచ్చాడు. అక్కడికి వెళ్లే ముందు పట్టణంలోని భువనగిరి రోడ్డులోని బీజేపీ నాయకుడు చికిలంమెట్ల అశోక్‌కు చెందిన పూజిత హెయిర్‌ కటింగ్‌ సెలూనలో గడ్డం చేయించుకున్నాడు. ఆ సమయంలో అతడి చేతికున్న నాలుగున్నర తులాల బంగారు బ్రాస్‌లెట్‌ పడిపోయింది. అతడు వెళ్లిన తరువాత గమనించిన అశోక్‌ అతడి ఫోననెంబర్‌ లేకపోవడంతో దానిని తీసి భద్రపరిచాడు. సోమవారం రాత్రి ఇంటికి వెళ్లిన తరువాత బ్రాస్‌లెట్‌పోయిన విషయం గుర్తించి మంగళవారం ఉదయాన్నే చిట్యాలకు వచ్చి ఫంక్షనహాల్‌లో వెతికినా దొరకలేదు. చివరగా హెయిర్‌కటింగ్‌ సెలూనకు వచ్చి అశోక్‌ను అడగ్గా అది తన వద్దే ఉందని తీసి ఇచ్చాడు. పోయిందనుకున్న బ్రాస్‌లెట్‌ దొరకడంతో గణే్‌షతో పాటు అతడి కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తంచేశారు. అశోక్‌ను గణేష్‌ కుటుంబసభ్యులతో పాటు పక్కషాపుల వారు అభినందించారు. కార్యక్రమంలో పాల మహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2025 | 12:37 AM