Share News

గ్రామ సభలను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - Jan 18 , 2025 | 12:55 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుభరో సా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధిం చి గ్రామసభలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శి, జిల్లా ప్రత్యేకాధికారి అనితా రామచంద్రన్‌ అన్నారు.

గ్రామ సభలను పకడ్బందీగా నిర్వహించాలి

జిల్లా ప్రత్యేకాధికారి అనితా రామచంద్రన్‌

నల్లగొండ, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుభరో సా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధిం చి గ్రామసభలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శి, జిల్లా ప్రత్యేకాధికారి అనితా రామచంద్రన్‌ అన్నారు. శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నాలుగు పథకాలకు సంబంధించిన విఽధివిధానాలను గ్రామసభల్లో ప్రజలకు వివరించి జాబితాను చదివి అర్హులను మాత్రమే ఎంపిక చే యాలన్నారు. కలెక్టర్‌ ఇలా త్రిపాఠి మాట్లాడు తూ, రైతు భరోసా సర్వేకు జిల్లాలో 140 బృం దాలు ఏర్పాటు చేసి ఈనెల 16 నుంచి క్షేత్రస్థా యి పరిశీలన నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 138 రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తయిందని తెలిపారు. సమావేశంలో మిర్యాలగూ డ సబ్‌ కలెక్టర్‌ నారాయణ్‌ అమిత్‌, అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

అర్హులను ఎంపిక చేయాలి

(ఆంధ్రజ్యోతి, కనగల్‌): ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన వారిని ఎంపిక చేయాలని జిల్లా ప్రత్యేకాధికారి అనితా రాంచంద్రన్‌ అన్నా రు. శుక్రవారం కనగల్‌లో రేషన్‌కార్డుల సర్వేను ఆమె తనిఖీచేసి అధికారులకు పలు సూచనలు చేశారు. సర్వేను సకాలంలో పూర్తి చేయాలన్నారు. అనంతరం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న పౌష్ఠికాహార వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆమె వెంట కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, తహసీల్దార్‌ పద్మ, ఎంపీడీవో జయరాం, ఎంపీవో సుమలత, డీటీ పార్వతమ్మ, తదితరులు ఉన్నారు.

Updated Date - Jan 18 , 2025 | 12:55 AM