బంగారం తాకట్టు వ్యాపారి పరార్
ABN , Publish Date - Jan 25 , 2025 | 01:36 AM
యాదగిరిగుట్ట రూరల్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఓ బంగారు నగల తాకట్టు వ్యాపారి పరారయ్యాడు.

యాదగిరిగుట్ట రూరల్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఓ బంగారు నగల తాకట్టు వ్యాపారి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బాధి తులు గతంలో ఆ వ్యాపారి పనిచేసిన దు కా ణం ఎదుట నిరసన వ్యక్తంచేశారు. తాకట్టు పెట్టుకున్న బంగారం, వడ్డీలకు తీసుకున్న నగదు మొత్తం రూ.5కోట్లకు పైగా ఉంటుందని బాధితులు చెబుతున్నారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నా యి. రాజస్థాన్‌కు చెందిన జితేందర్ సింగ్ రాథోడ్ బతుకుదెరువు కోసం పదేళ్ల క్రితం యాదగిరిగుట్టకు వచ్చాడు. పట్టణంలో దుర్గాభవాని జ్యూవెల్లర్స్‌లో పనికి చేరాడు. మూడేళ్ల తర్వాత కిరాణ దుకాణం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నాడు. నాలుగు నెలల క్రితం యాదగిరిగుట్టలోని పాతగుట్ట రోడ్డుకు ఎదురుగా సుమారు 80 గజాల స్థలాన్ని రూ.80లక్షలకు కొనుగోలు చేసి, అందులో భవనాన్ని నిర్మించి జై భవాని పేరుతో తాకట్టు వ్యాపారం చేస్తున్నాడు. ఇతన్ని నమ్మి బంగారం తాకట్టుపెట్టి రూ.లక్షలు అధిక వడ్డీకి తీసుకుంటున్నారు. ఇదే సమయంలో జితేందర్‌సింగ్ రాథోడ్ స్థానికుల వద్ద అధిక వడ్డీకి డబ్బులు అప్పుగా తీసుకున్నాడు. ఇతని వద్ద బంగారం తాకట్టు పెట్టుకున్న వారికి ఫోన్‌చేసి డబ్బులు చెల్లించి బంగారం తీసుకోవాలని సూచించాడు. అయితే సుమారు 10మంది డబ్బులు చెల్లించారు. కానీ ఇతను బం గారం ఇవ్వకుండా రెండు రోజుల తర్వాత ఇస్తానని నమ్మబలికాడు. వీటికితోడు జితేందర్‌కు అప్పులు పెరగడంతో స్థానికులకు చెప్పకుండా ఉడాయించాడు. తాకట్టు పెట్టుకున్న బంగారం, వడ్డీలకు తీసుకున్న నగదు మొత్తం రూ.5కోట్లు ఉంటుందని బాధితులు చెబుతున్నారు. ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో బాధితులు ఇతను గతంలో పనిచేసిన దుర్గాభవాని జ్యూవెల్లర్స్ వద్ద బాధితులు, వారి కుటుంబ సభ్యులు 500మందితో ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న యాదగిరిగుట్ట సీఐ రమేష్, ఎస్‌ఐ ఉదయ్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి కి సర్దిజెప్పే ప్రయత్నం చేయగా, వినకపోవడంతో పోలీసులు డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేస్తామని, స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయమని చెప్పారు. అలాగే దుర్గాభవాని జూవెల్లర్స్ యాజమాన్యం సహకారంతో నిందితుడిని రప్పించి, మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పలువురు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.