వైభవంగా యోగానంద లక్ష్మీనృసింహుడి కల్యాణోత్సవం
ABN , Publish Date - Feb 13 , 2025 | 12:53 AM
అర్వపల్లి యోగానంద లక్ష్మీనృసింహుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామి వారి కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. తొలుత స్వస్తివాచనంతో ఉత్సవాల కు అంకుర్పారణ చేశారు.

అర్వపల్లి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): అర్వపల్లి యోగానంద లక్ష్మీనృసింహుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామి వారి కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. తొలుత స్వస్తివాచనంతో ఉత్సవాల కు అంకుర్పారణ చేశారు. అనంతరం లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెం చులక్ష్మి ఎదుర్కోలు మహోత్సవాన్ని మంగళవాయిద్యాలు, మంత్రోచ్ఛారణ ల నడుమ అర్చకులు నిర్వహించారు. ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలు, ముత్యాలు, బంగారు ఆభరణాలతో దివ్యమనోహరంగా అలకరించి కల్యా ణ వేదికపై అధిష్ఠింపజేశారు. అనంతరం వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తుల జయజయధ్వానాల నడుమ కల్యాణ తంతు ను అర్చకులు నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు కల్యాణ పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే మందుల సామేలు సమర్పించారు. వీటిని కోలాటాల ప్రదర్శన నడుమ ఆలయానికి చేర్చారు. మహిళా భక్తులు దీపారాధన చేయగా, తలంబ్రాలు, కొబ్బరికాయలు, పట్టు వస్త్రాలు, పుస్తె, మెట్టెలు స్వామి, అమ్మవార్లకు సమర్పించి తాళికట్టే తంతును నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఇందుర్తి వెంకట్‌రెడ్డి, గుడిపెల్లి మధుకర్‌రెడ్డి, సామ అభిషేక్‌రెడ్డి, బీరవోలు విక్రమ్‌రెడ్డి, కొడపిర్త అవిల య్య, రాగి అనిల్‌కుమార్, బైరబోయిన మహరాజు, వేల్పుల రమేష్, బైరబోయిన సైదులు, కనుకు శ్రీనివాస్, బైరబోయిన రామలింగయ్య, మహేష్, వెంకట్‌రెడ్డి, కోటి ప్రసాద్, రమేష్, తదితరులు పాల్గొన్నారు. కల్యాణోత్సవం సందర్భంగా నాగారం సీఐ రఘువీరారెడ్డి, అర్వపల్లి ఎస్‌ఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు.