Share News

మేళ్లచెర్వు జాతరకు రూ.కోటి నిధులు

ABN , Publish Date - Jan 31 , 2025 | 12:38 AM

మేళ్లచెర్వు శంభులింగేశ్వరస్వామి ఆలయ మహాశివరాత్రి జాతరకు రూ.కోటి మంజూరు చేసినట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు.

మేళ్లచెర్వు జాతరకు రూ.కోటి నిధులు

సాధారణ భక్తుల సౌకర్యార్థం వినియోగించాలి : మంత్రి ఉత్తమ్‌

మేళ్లచెర్వు, జనవరి 30 (ఆంధ్రజ్యోతి):మేళ్లచెర్వు శంభులింగేశ్వరస్వామి ఆలయ మహాశివరాత్రి జాతరకు రూ.కోటి మంజూరు చేసినట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నిధులను సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుం డా ఏర్పాట్లు చేసేందుకు వినియోగించాలని ఆయన సూచించారు. ఫిబ్రవరి 26నుంచి ఐదు రోజులపాటు నిర్వహించే జాతరకు సుమారు ఆరు లక్షల మంది భక్తులు వస్తారనే అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.భక్తుల సౌకర్యా ర్థం, మౌలిక సదుపాయాల కల్పనకు, ఆలయ అభివృద్ధి కోసం స్పెషల్‌ డెవల్‌పమెంట్‌ ఫండ్‌ ద్వారా నిధులను విడుదల చేసినట్లు వివరించారు. ఈ నిధులకు కలెక్టర్‌ పర్యవేక్షణలో జాతర పనులకు, ఆలయ అభివృద్ధికి మాత్రమే వినియోగించాలన్నారు. గతం కంటే జాతరను ఘనంగా నిర్వహించాలని, అన్నిశాఖల అధికారులు, సమన్వయంతో పనిచేసి, ఆధ్యాత్మిక, ప్రశాంత వాతావరణంలో జాతరను విజయవంతం చేయాలని మంత్రి సూచించారు.

మేళ్లచెర్వులో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌

మేళ్లచెర్వులోని మండలకేంద్రంలోని ప్రముఖ ఆలయాలను దేవాదాయ శా ఖ సహాయ కమిషనర్‌ కే భాస్కర్‌ గురువారం సందర్శించారు. స్వయంభు శం భులింగేశ్వర స్వామి, శ్రీరామ ఆలయాలను దర్శించుకుని అభిషేకాలు, అర్చన ల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం అర్చకులు స్వామి వారి శేషవసా్త్రలు, తీర్థప్రసాదాలతో ఆయన్ను సత్కరించారు. ఆయన వెంట రామాలయ ఈవో శంభిరెడ్డి, అర్చకులు విష్ణువర్థనశర్మ, కొండారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jan 31 , 2025 | 12:38 AM