భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించాలి
ABN , Publish Date - Feb 23 , 2025 | 12:14 AM
లింగబసవేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కలెక్టర్ హనుమంతరావు భక్తులకు సూచించారు. శనివారం మండలంలోని పడమటిసోమారంలో వెలసిన లింగబసవేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఆర్డీవో కృష్ణారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అంతకుముందు ఆలయ ఈవో నరేందర్‌రెడ్డి, ఆలయ ప్రధాన పూ జారి రాంసింగ్ కలెక్టర్, ఆర్డీవోను పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయంలోకి తోలుకుని వెళ్లారు.

కలెక్టర్ హనుమంతరావు
బీబీనగర్, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): లింగబసవేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కలెక్టర్ హనుమంతరావు భక్తులకు సూచించారు. శనివారం మండలంలోని పడమటిసోమారంలో వెలసిన లింగబసవేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఆర్డీవో కృష్ణారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అంతకుముందు ఆలయ ఈవో నరేందర్‌రెడ్డి, ఆలయ ప్రధాన పూ జారి రాంసింగ్ కలెక్టర్, ఆర్డీవోను పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయంలోకి తోలుకుని వెళ్లారు. వారు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం హోమంలో పాల్గొన్నారు. కలెక్టర్ భక్తులనుద్దేశించి మాట్లాడుతూ మూడు రోజులపాటు జరిగే ఉత్సవాలకు అన్నిరకాల ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామన్నారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం అగ్నిగుండాలను తిలకించేందుకు రాష్ట్రంనుంచే కాకుండా వివిధ రాష్ర్టాలనుంచి ముఖ్యంగా గిరిజన సామాజికవర్గానికి చెందిన భక్తులు ఎక్కువగా తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథఽ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుందన్నారు. ఆయన వెంట ఆర్డీవో కృష్ణారెడ్డి, తహసీల్దార్ శ్రీధర్, ఎండీవో శ్రీనివాస్ రెడ్డి, ఈవో నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెం చే విధంగా కృషి చేయాలని కలెక్టర్ హనుమంతరావు ఉపాధ్యాయులకు సూచించారు. శనివారం బీబీనగర్ మండలం పడమటి సోమారం ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీచేశారు. ముందుగా ఉపాధ్యాయుల హాజరు రిజిస్ట ర్ తనిఖీచేసి ఉపాధ్యాయులు ఎంత మంది, ఎం దరు సెలవులో వెళ్లారు అని ప్రధానోపాధ్యాయు డు రంగయ్యను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థులు మొత్తం ఎంత మంది?, హాజరైన వారు ఎంత మంది?, వారికి అందిస్తున్న భోజనం వివరాలను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠ్యపుస్తకాలను చదివించి సామర్థ్యాన్ని పరీక్షించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచి ఉత్తీర్ణతశాతం పెరిగేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు చెప్పారు. పోషక విలువలతో కూడిన భోజనం అందించినప్పుడే విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి పెరిగి బాగా చదవగలుగుతారన్నారు. విద్యార్థులకు గణితంలో టేబుల్స్ నేర్పించి డిజిటల్ క్లాసులు, ప్రొజెక్టర్ ద్వారా పాఠాలు బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విధంగా ఉపాధ్యాయులంతా ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు.