రైతులను అగ్రభాగాన ఉంచేందుకు కృషి
ABN , Publish Date - Jan 09 , 2025 | 12:54 AM
రైతులను అన్ని రకాలుగా ప్రోత్సహించి అగ్రభాగాన నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు.
ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
ఆలేరు రూరల్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): రైతులను అన్ని రకాలుగా ప్రోత్సహించి అగ్రభాగాన నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. బుధవారం మండలంలోని బైరాంనగర్‌లో రూ.3.45కోట్లతో నిర్మించనున్న చెక్ డ్యాం, రూ.20లక్షలతో కొలనుపాక గుండ్లగూడెంలో సీసీ రోడ్ల నిర్మాణానికి, ఆలేరులో రూ.50లక్షలతో మహిళా శక్తి భవనానికి, టంగుటూరు, శారాజీపేటలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకే ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. చెక్‌డ్యాంల నిర్మాణంతో బైరాంనగర్, కొలనుపాక రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. మరో 15 రోజుల పాటు గోదావరి జలాలతో మండలంలోని అన్ని గ్రామాల చెరువులు నింపుతామన్నారు. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, తుమ్మల సహకారంతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానన్నారు. సంక్రాంతిలోగా రుణమాఫీ పూర్తిచేస్తామని, రైతు భరోసాను ఇస్తామన్నారు.
నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం
(ఆంధ్రజ్యోతి, ఆలేరు): నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడ మే ధ్యేయమని బీర్ల అయిలయ్య అన్నారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో రూ.50లక్షలతో మహిళాశక్తి భవనం, ఇందిరమ్మ డెమో ఇంటి నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమాల్లో పీసీసీ కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్, మార్కెట్ చైర్మన్ చైతన్యారెడ్డి, మార్కెట్ డైరెక్టర్ చిలుకు కిష్టయ్య, నీలం పద్మ, ఆరుట్ల లక్ష్మీప్రసాద్‌రెడ్డి, గాదె సోమిరెడ్డి, అశోక్, యుగేంధర్‌రెడ్డి, ఎంఏ.ఎజాజ్, బాబా, అయిలయ్య, తుంగ కుమార్, అశోక్, పచిమట్టల మదార్, నీలం పద్మ, చింతలపని సునీతా శ్రీనివా్‌సరెడ్డి, శమంతరెడి,్డ వెంకటస్వామి, విజయ్‌కుమార్, ఉప్పలయ్య, చింతలపని శ్రీనివాస్, కూళ్ల నర్సింహులు, భాస్కర్, ముదికొండ శ్రీకాంత్, ఆలేటి అనిల్, సంతోష్, సిద్ధులు, తదితరులు పాల్గొన్నారు.