Share News

ఉండ్రుగొండ గిరిదుర్గం అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Jan 12 , 2025 | 01:06 AM

ఉండ్రుగొండ గిరిదుర్గం అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన పటేల్‌ రమే్‌షరెడ్డి అన్నారు.

ఉండ్రుగొండ గిరిదుర్గం అభివృద్ధికి కృషి
ఉండ్రుగొండను సందర్శిస్తున్న పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన పటేల్‌ రమే్‌షరెడ్డి

రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన పటేల్‌ రమేష్‌రెడ్డి

చివ్వెంల, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : ఉండ్రుగొండ గిరిదుర్గం అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన పటేల్‌ రమే్‌షరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని ఉండ్రుగొండ శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్కింగ్‌, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పిస్తామన్నారు. తెలంగాణ-ఆంధ్రప్రదేశ రాష్ట్రాల మధ్య ఉన్న ఉండ్రుగొండ గిరిదుర్గం అభివృద్ధికి ప్రభుత్వంతో పాటు దాతలు సహకరించాలన్నారు. అదేవిధంగా పిల్లలమర్రి శివాలయాలు, మినీట్యాంక్‌బండ్‌, శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేకనిధులు మంజూరు చేయిస్తామన్నారు. కార్యక్రమంలో గిరిదుర్గం అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి రవిచంద్ర, ఆలయ కమిటీ అధ్యక్షుడు చకిలం కృష్ణకుమార్‌, కృష్ణమోహన, వూర రామూర్తియాదవ్‌, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 01:06 AM