బత్తాయికి తామర ముప్పు
ABN , Publish Date - Feb 22 , 2025 | 12:44 AM
దశాబ్దకాలంగా వాతావరణంలో మార్పులు ఏర్పడుతున్నాయి. విత్తనం నాటిన నాటి నుంచే పంట కోతకు వచ్చే వరకు పురుగుల ఉధృతి అధికమైంది. ప్రతీ పంట సాగులో నూ ఎన్నో ఒడిదొడుకులు ఎదురవుతున్నాయి. ఉష్ణప్రాంత పంట అయిన బత్తాయి ప్రతికూల పరిస్థితులను కొంత మేర కు తట్టుకుంటుంది.
జీవం కోల్పోయిన సీజన్ పూత
ఈ ఏడాది దిగుబడులపై తీవ్ర ప్రభావం
పెట్టుబడులు వచ్చేది కష్టమే
(ఆంధ్రజ్యోతి, మిర్యాలగూడ(వ్యవసాయం): దశాబ్దకాలంగా వాతావరణంలో మార్పులు ఏర్పడుతున్నాయి. విత్తనం నాటిన నాటి నుంచే పంట కోతకు వచ్చే వరకు పురుగుల ఉధృతి అధికమైంది. ప్రతీ పంట సాగులో నూ ఎన్నో ఒడిదొడుకులు ఎదురవుతున్నాయి. ఉష్ణప్రాంత పంట అయిన బత్తాయి ప్రతికూల పరిస్థితులను కొంత మేర కు తట్టుకుంటుంది. అటువంటి బత్తాయి పంటకు కొత్త ముప్పు వచ్చి పడింది. ఇప్పటి వరకు మంగునల్లి, వేరుకుళ్లు వంటి ప్రమాదకరమైన తెగుళ్లను ఎదుర్కొంటున్న బత్తాయికి నల్ల తామర పురుగు ఆశించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. దీంతో రైతుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 40వేల ఎకరాల్లో బత్తాయి సాగవుతోంది. బత్తాయిలో ప్రధానంగా సీజన్ కా య 80శాతం మేర దిగుబడి వస్తుంది. సాధారణంగా నవంబరులో వాడుకు వదిలి (బహెర్ పద్ధతి) డిసెంబరు నెలలో నీటి తడులు ఇవ్వడం ద్వారా జనవరి, ఫిబ్రవరిలో పూత దశకు వస్తుంది. ప్రస్తుతం బత్తాయి పూత దశ నుంచి మొ గ్గకు చేరే దశలో ఉంది. ఈ సమయంలో నల్ల తామర పురు గు ఆశించి పూత జీవం కోల్పోయిందని రైతులు చెబుతు న్నారు. బత్తాయిలో పూత 70-80 శాతం వరకు నుసిగా మారిపోయింది. ఎన్ని పురుగు మందులు పిచికారీ చేసినా పూతను కాపాడుకోలేక పోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దిగుబడులపై తీవ్ర ప్రభా వం పడుతుంది. సాధారణంగా ఎకరానికి 6-8టన్నుల దిగుబడి వరకు వస్తుంది. ప్రస్తుతం రెండు టన్నులు కూడా రావని రైతులు వాపోతున్నారు. నాలుగేళ్లుగా కొంత మేర తామర పురుగు వ్యాప్తి ఉన్నా 20శాతం మేర మాత్రమే నష్టం వాటిల్లింది. ఏటా ఉధృతి పెరుగుతూ ఈ ఏడాది పూర్తిస్థాయిలో పంటకు వ్యాప్తించడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. బత్తాయికి ఎకరానికి సుమారు రూ.50వేలకు పైబడి పెట్టుబడి అవుతుంది. ప్రస్తుతం బత్తాయిలో కత్తెరతోపాటు సీజన్ కాయలేకపోవడంతో కనీసం పెట్టుబడిలో పది శాతం మేర ఆదాయం వచ్చే పరిస్థితి లేదు.
సీజన్ పూత దెబ్బతిన్నది: కరణం మల్లిఖార్జున్, రైతు, హాలియా
బత్తాయి 10 ఎకరాల్లో సాగు చేస్తున్నా. ప్రస్తుతం పంట పూత దశలో ఉంది. వందశాతం సీజన్ పూత వచ్చినా సుమారు 80శాతం పూత పిందె ఏర్పడే దశలో ఎండిపోయింది. ఎన్ని మందులు పిచికారీ చేసినా ఎటువంటి మార్పులు రాలేదు. ఏటా సుమారు 80-100 టన్నుల వరకు సీజన్ బత్తాయి దిగుబడులు వచ్చేవి. ఈ ఏడాది పూర్తిస్థాయిలో పూత దెబ్బతినడంతో కనీసం 20 టన్నుల దిగుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు
తామర పురుగుల ఉధృతితో పంటలకు నష్టం..
దండు ఆదర్ష్, శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, గడ్డిపల్లి
తామర పురుగులు నాలుగేళ్లుగా మిరప పంటకు వ్యా పించి తీవ్ర నష్టాన్ని కలగజేస్తున్నాయి. ఈ ఏడాది మా త్రం బత్తాయిలో ఉధృతి అధికమైంది. పూతను ఆశించి నష్టాన్ని కలిగిస్తున్నారు. ఈ పురుగు కంటికి కనపడనంత చిన్నగా, నల్లగా అర సెంటీమీటర్ పరిమాణంలో ఉంటుం ది. పురుగు గుడ్డు దశ నుంచి లార్వా దశకు చేరే సమయంలో ఆకులు, పూతలు, కాయలను ఆశించి రంపం వం టి నోటితో గీకి పత్రహరితాన్ని పీల్చేస్తుంది. ఇది ఆశించిన ఏ పంట అయినా పూర్తిస్థాయిలో దెబ్బతింటుంది. ఈ పురుగు దశ 20-25 రోజుల వరకు ఉంటుంది. పంటను ఆశించిన తరువాత భూమిలోకి చేరి కోశస్థ దశకు చేరుతుంది. 3-5 రోజుల తరువాత నిద్రావస్థ పూర్తి చేసుకుని పురుగు సంపర్కం చేసుకుని గుడ్లు పెడుతుంది. పిల్లపురుగులతో కలిసి తల్లి పురుగు పది రోజుల వ్యవధిలో పం టను మొత్తం ఆశించి నష్టం చేస్తుంది. ఉబ్బ, అధిక వేడి వాతావరణం ఈ పురుగు ఉధృతి పెరగడానికి కారణాలు.
నివారణ
8 ప్రాథమిక దశలో ఈ పురుగు ఉధృతిని అరికట్టేందుకు వేప నూనె 10వేల పీపీఎం 2ఎంఎల్, లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. 8 ఫిఫ్రోనిల్ 2ఎంఎల్, స్పెనోషాడ్ 0.3ఎంఎల్, లీటర్ నీటికి, ఇమిడాఇప్రోనిల్ 0.3ఎంఎల్, లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
8 పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు ఎక్స్‌పోన్‌సగ్రేసియా ఎకరానికి 34ఎంఎల్, స్పెరాటెట్రామిల్ 1గ్రా. లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
8 జంప్ ఎకరానికి 40గ్రా. గుళికలు, (పిచికారీకి, నేలలో వేయడానికి ఉపయోగపడుతుంది)
8 టెట్రామిల్ 1ఎంఎల్ లీటర్ నీటికి కలిపి, అదనంగా పంటకు 13-0-45, 19-19-19 మందులు 5-10 గ్రాముల వరకు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
8 గుళికలు చెట్టు వయసును అనుసరించి సరైన పరిమాణాన్ని అడుగు భాగంలో వేయాలి.
8 పురుగు ఉధృతిని అనుసరించి ఆర్గానిక్ మందులు పిచికారీ చేయాలి. బవేరియా 5ఎంఎల్, వర్టిసేలియమ్‌లకాన్ 5ఎంఎల్, వేప నూనె 5ఎంఎల్, లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఒక వారం ఆర్గానిక్ మందులు, మరో వారం రసాయనిక మందులు పిచికారీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
ఎరలు ఏర్పాటు
8 సోలార్ దీపపు ఎరలు ఎకరానికి 4-5 ఏర్పాటు చేసుకోవాలి.
8 నీలి రంగు జిగురు అట్టలు ఎకరానికి 20-30 ఏర్పా టు చేసుకుంటే పురుగుల ఉధృతిని అరికట్టవచ్చు.