Share News

‘ప్రజావాణి’ అర్జీలను పెండింగ్‌లో పెట్టొద్దు

ABN , Publish Date - Jan 07 , 2025 | 12:39 AM

ప్రజావాణి అర్జీలన్నింటినీ పరిశీలించి పెండింగ్‌ లేకుండా పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు జి.వీరారెడ్డి, కె.గంగాధర్‌ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణిలో ప్రజలనుంచి పలు సమస్యలకు సంబంధించిన 48 అర్జీలను వారు స్వీకరించారు.

‘ప్రజావాణి’ అర్జీలను పెండింగ్‌లో పెట్టొద్దు

అదనపు కలెక్టర్లు జి.వీరారెడ్డి, కె.గంగాధర్‌

భువనగిరి (కలెక్టరేట్‌), జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి అర్జీలన్నింటినీ పరిశీలించి పెండింగ్‌ లేకుండా పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు జి.వీరారెడ్డి, కె.గంగాధర్‌ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణిలో ప్రజలనుంచి పలు సమస్యలకు సంబంధించిన 48 అర్జీలను వారు స్వీకరించారు. వాటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు 35 దరఖాస్తులు రాగా, జిల్లా పంచాయతీకి 6, హౌసింగ్‌ 3, రోడ్లు భవనాలశాఖ, మునిసిపాలిటీ, ఎక్సైజ్‌ శాఖ, పరిశ్రమల శాఖలకు సంబంధించిన ఒక్కొక్కటి చొప్పున దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎన్‌.శోభారాణి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి టి.నాగిరెడ్డి, సూపరింటెండెంట్‌ రవికుమార్‌ కలెక్టరేట్‌ ఏవో జగన్‌మోహన ప్రసాద్‌, అధికారులు పాల్గొన్నారు. రామన్నపేట: అంబుజా సిమెంట్‌ పరిశ్రమను రద్దు చేసినట్లు ప్రకటించాలని రామన్నపేట అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రజావాణిలో కలెక్టరేట్‌ కార్యాలయంలో అదనపు కలెక్టర్‌ వీరారెడ్డికి సోమవారం వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీ నాయకులు మేక అశోక్‌రెడ్డి, జెల్లెల పెంటయ్య, ఎండీ రేహన్‌, పల్లపు దుర్గయ్య, ఊట్కూరి నర్సింహ పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 12:39 AM