పరువుహత్య నిందితులను శిక్షించాలి
ABN , Publish Date - Feb 07 , 2025 | 12:34 AM
సూర్యాపేటలో వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల బంటిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన చైర్మన బక్కి వెంకటయ్య అన్నారు.

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన చైర్మన వెంకటయ్య
సూర్యాపేట(కలెక్టరేట్), ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి) : సూర్యాపేటలో వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల బంటిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన చైర్మన బక్కి వెంకటయ్య అన్నారు. గురువారం కమిషన సభ్యులు జిల్లా శంకర్, రాంబాబుతో కలిసి జిల్లా కేంద్రంలోని మామిళ్లగడ్డలో వడ్లకొండ కృష్ణ కుటుంబ సభ్యులు తండ్రి డేవిడ్, భార్య భార్గవి, సోదరి శ్వేత, బావ నరే్‌షలను పరామర్శించారు. అనంతరం కలెక్టరేట్‌లో కేసు పురోగతిపై కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌తో చర్చించారు. అనంతరం చైర్మన వెంకటయ్య మాట్లాడుతూ బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆదేశించారు. హత్య కేసును ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్న వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. బాధిత కుటుంబానికి త్వరగా న్యాయం జరిగేలా చూడాలన్నారు. చట్టప్రకారం తక్షణసాయం కింద నిత్యావసరాలు అందజేయాలన్నారు. బాధిత కుటుంబానికి మూడు ఎకరాల వ్యవసాయ భూమి, ఇందిరమ్మ ఇల్లు, ఉద్యోగం ఇవ్వాలని కలెక్టర్‌కు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి నష్టపరిహారం కింద రూ.4 లక్షలు చెల్లించామన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేశ్వర్‌రావు, ఆర్డీవో వేణుమాధవ్, డీఎస్పీ జీ రవి, జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి లత తదితరులు ఉన్నారు. క్రిష్ణను హత్య చేసిన హంతకులను కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన చైర్మన వెంకటయ్యకు సంఘం ఆధ్వర్యంలో పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేసి, మాట్లాడారు. కులం పేరుతో హత్యకు గురైన క్రిష్ణ కుటుంబాన్ని కలెక్టర్, ఎస్పీ పరామర్శించకపోవడం సరైందికాదన్నారు.
కృష్ణ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో సంఘం మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తల్లమల్ల హస్సేన, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర్‌రావు, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు వీర్జాల వేణు, నాయకులు సైదులు, యాదగిరి, ఆనందరావు తదితరులు ఉన్నారు.