Share News

కమ్యూనిజం వైపు ప్రపంచ దేశాలు

ABN , Publish Date - Feb 26 , 2025 | 01:02 AM

ప్రపంచ దేశాలు కమ్యూనిజం వైపు చూస్తున్నాయని, సమస్యల పరిష్కారానికి సోషలిజ మే మార్గమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. మండలకేంద్రంలో మంగళవా రం సీపీఎం జిల్లా విస్తృత సమావేశం జరిగింది.

కమ్యూనిజం వైపు ప్రపంచ దేశాలు

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

వలిగొండ, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ దేశాలు కమ్యూనిజం వైపు చూస్తున్నాయని, సమస్యల పరిష్కారానికి సోషలిజ మే మార్గమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. మండలకేంద్రంలో మంగళవా రం సీపీఎం జిల్లా విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారి విధానంతో అనేక సంక్షోభాలు ఏర్పడి సమానత్వంకోసం పోరాడే ప్రజలు కమ్యూనిజం కావాలంటున్నారని, భవిష్యత్‌ కమ్యూనిజానికి మంచి రోజులు రాబోయే కాలం లో ప్రజలందరూ కమ్యూనిస్టులు నిర్వహించే ప్రజా పోరాటాల్లో భాగస్వాములు కావాలన్నారు. ఇటీవల అమెరికాలో నూతనంగా ఏర్పడిన ట్రంప్‌ ప్రభుత్వం భారతీయులను దేశంనుంచి గెంటివేస్తుంటే ప్రధాని నరేంద్ర మోదీ వారితో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చేరుపల్లి సీతారాములు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కాలయాపన చేస్తోందన్నారు. మాటూరి బాలరాజు అధ్యక్షతన జరిగి న కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్‌, రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ, జిల్లా కార్యవర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, దాసరి పాండు, బూరుగు కృష్ణారెడ్డి, జల్లెల పెంటయ్య, గుంటోజు శ్రీనివాసచారి, మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, గణపతిరెడ్డి, యాదగిరి, సైదులు, వెంకటేశం, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2025 | 01:02 AM