Share News

కమ్యూనిస్టులను ఆదరించాలి: జహంగీర్‌

ABN , Publish Date - Feb 15 , 2025 | 12:59 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో కమ్యూనిస్టులను ఆదరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ.జహంగీర్‌ కోరారు.

 కమ్యూనిస్టులను ఆదరించాలి: జహంగీర్‌

చౌటుప్పల్‌ టౌన, పిబ్రవరి 14 ( ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో కమ్యూనిస్టులను ఆదరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ.జహంగీర్‌ కోరారు. చౌటుప్పల్‌ పట్టణంలోని కందాళ రంగారెడ్డి భవనలో శుక్రవారం సీపీఎం మండల జనరల్‌ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జహంగీర్‌ మాట్లాడుతూ, స్వార్థంతో పదవుల కోసం పాకులాడే బూర్జువా పార్టీల నాయకులు డబ్బు సంచులు, మద్యం బాటిల్స్‌ తో ఎన్నికల్లో దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని, అలాంటి వారిని తరిమి కొట్టాలని ఆయన అన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని, ప్రభుత్వం పై ప్రజల్లో రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతుందని ఆయన అన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బూరుగు కృష్ణా రెడ్డి, మండల కార్యదర్శి గంగదేవి సైదులు, నాయకులు పొట్ట శ్రీనివాస్‌, చీరిక సంజీవ రెడ్డి, పల్లె మధు కృష్ణ ,ఎ. నందీశ్వర్‌, సీహెచ. వెంకటేశం, కొండె శ్రీశైలం, చింతల సుదర్శన. బి. నరేష్‌, శ్రీకాంత, సుజిత, అలివేలు, రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2025 | 12:59 AM