సీఎంఆర్ అక్రమాలపై సీబీఐ
ABN , Publish Date - Feb 26 , 2025 | 12:38 AM
పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన బియ్యం నేటికీ పూర్తిస్థాయిలో సేకరణ జరగలేదు.

ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యం విలువ రూ.623 కోట్లు
2012 నుంచి జిల్లాలో సీఎంఆర్ పెండింగ్
1.71 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం బకాయి
తాజాగా చర్యలకు సిద్ధమవుతున్న అధికారులు
(ఆంధ్రజ్యోతి,సూర్యాపేట (కలెక్టరేట్)
పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన బియ్యం నేటికీ పూర్తిస్థాయిలో సేకరణ జరగలేదు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సివిల్‌సప్లయ్ శాఖ ఆధ్వర్యంలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది. ఆ ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి ప్రభుత్వానికి అప్పగించేందుకు మిల్లులకు ధాన్యం తరలిస్తారు. ఆ ధాన్యానికి సంబంధించి జిల్లాలో 2012 నుంచి కొంత మంది మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని ఇవ్వకుండా పెండింగ్‌లో ఉంచారు. అంతేకాకుండా ధాన్యాన్ని బియ్యంగా మార్చి కొంతమంది మిల్లర్లు సొమ్ము చేసుకున్నారు.
ఏళ్లు గడుస్తున్నా సీఎంఆర్ లక్ష్యం పూర్తి కాకపోవడంతో అధికారులు మిల్లుల్లో తనిఖీలు నిర్వహించారు. మిల్లుల్లో ధాన్యం నిల్వలు లేనట్లు గుర్తించారు. దీంతో అక్రమాలకు పాల్పడిన మిల్లుల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చే యించారు. అయినప్పటికీ ఇంకా సీఎంఆర్ పూర్తి కాలేదు. సీఎంఆర్ పెండింగ్ ఉన్న మిల్లులకు తాజాగా ధాన్యం సరఫరా నిలిపివేశారు. అయిన్పటికీ యజమానులు పెండింగ్ సీఎంఆర్ పూర్తి చేయడంలేదు. జిల్లాలో సీఎంఆర్ విషయంలో పెత్తఎత్తున అక్రమాలు జరిగినట్లు, ఇందుకు కొందరు అఽధికారులు సహకరించారని నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఎనజీవో సంస్థ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదుచేసింది. కేంద్ర ప్రభుత్వం అక్రమాలపై సీబీఐ చేత విచారణ చేయించేందుకు చర్యలు చేపట్టింది.
రంగంలోకి దిగిన సీబీఐ
సీబీఐ అధికారులు ఇటీవల జిల్లాలో పర్యటించి ప్రాథమిక విచారణ చేపట్టినట్లు సమాచారం. 2022-23లో ప్రభుత్వానికి సీఎంఆర్ బకా యి ఉన్న మిల్లులకు నోటీసులు జారీచేసి వారి నుంచి 25శాతం జరిమానాతో సీఎంఆర్ రాబట్టడానికి చర్య లు చేపట్టాలని రాష్ట్ర సివిల్ సప్లయ్ కమిషనర్ డీఎస్ చౌహాన ఆదేశించారు. జిల్లాలోని 13మిల్లులకు నోటీసులు జారీ చేసేందుకు సివిల్ సప్లయ్ శాఖ అధికారు లు చర్యలు చేపడుతున్నారు. ప్రతీ సీజనలో ధాన్యాన్ని బియ్యంగా మార్చేందుకు జిల్లాలోని 48 రైస్‌మిల్లులకు సరఫరా చేశారు. కస్టమ్ మిల్లింగ్ బియ్యం సేకరణ అధికారుల కు ప్రతి ఏడాది ఇబ్బందిగా మారింది. జిల్లాలోని 23 మండలాల పరిధిలోని 3లక్షలకు పైగా ఉన్న రేషన్‌కార్డుదారులకు ప్రతి నెలా బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇందుకు ఏడాదికి 67,152మెట్రిక్ టన్నుల బియ్యం అవసరముంటుంది. అందుకోసం సివిల్‌సప్లయ్ శాఖ జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు కేటాయించి బియ్యంగా మార్చేందుకు చర్యలు చేపట్టింది. అయితే మిల్లర్లు ఇంకా 1.71లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది.
బకాయిదారులకు నోటీసులు జారీకి చర్యలు
సీఎంఆర్ పెండింగ్ ఉంచిన మిల్లుల యజమానులపై ఇప్పటికే చట్టపరంగా కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ మిల్లుల యాజమాన్యాలు మాత్రం సీఎంఆర్ పూర్తిచేయడం లేదు. దీంతో సంబంధిత సీఎంఆర్ బకాయిదారుల్లో ఎనిమిది మంది మిల్లర్లపై ఆర్‌ఆర్ యాక్టు అమలుకు అధికారులు చర్యలు చేపట్టారు. సీఎంఆర్‌ను ఆలస్యంగా పూర్తిచేస్తున్న మిల్లర్ల నుంచి 25శాతం జరిమానాతో పాటు 12శాతం వడ్డీని వసూలు చేయనున్నారు. ఈ విధంగా జిల్లాలోని పలువురు మిల్లర్లు రూ.కోట్లలో ప్రభుత్వానికి బకాయి ఉన్నారు. తాజాగా 2022-23 యాసంగి సీజనకు సంబంధించి జిల్లాలోని 13 మిల్లుల నుంచి సుమారు 65వేల మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. రాష్ట్ర సివిల్ సప్లయ్ శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన ఆదేశాలతో శ్రీ బాలాజీ రైస్ ఇండస్ర్టీ్‌స(మునగాల), శివసాయి రైస్ అండ్ ఫ్లోర్‌మిల్(సూర్యాపేట), వెంకటసాయి రైస్ ఇండస్ర్టీ్‌స(సూర్యాపేట), తేజ రైస్ ఇండస్ర్టీ్‌స(కోదాడ), ఏఎ్‌సఆర్ పార్‌బాయిల్డ్ రైస్ ఇండస్ర్టీ్‌స(తిరుమలగిరి), రవిక్రిష్ణ రైస్ ఇండస్ర్టీ్‌స(సూర్యాపేట), వజ్రవికాస్ రైస్ ఇండస్ర్టీ్‌స(సూర్యాపేట), శివదుర్గ రైస్ ఇండరస్ర్టీ్‌స(బీబీగూడెం), వజ్ర రైస్ మిల్(సూర్యాపేట), శ్రీదేవి ట్రేడర్స్(హుజూర్‌నగర్), శ్రీవసుంధర రైస్ ఇండస్ర్టీ్‌స(కోదాడ), జగనమాత రైస్ ఇండస్ర్టీ్‌స(చివ్వెంల), వెంకటేశ్వర రైస్‌ఇండస్ర్టీ(కాసరబాద) మిల్లులకు నోటీసులు ఇవ్వనున్నారు. నోటీసులకు మిల్లుల యజమానులు ఇచ్చే సమాధానాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.
జిల్లాలో రూ.623కోట్ల సీఎంఆర్ బకాయి
జిల్లా పరిధిలో సుమారు రూ.623కోట్ల విలువ చేసే సీఎంఆర్ మిల్లర్ల వద్ద పెండింగ్‌లో ఉంది. ఇదివరకే తిరుమలగిరి, తొండ, గరిడేపల్లి, కోదాడ ప్రాంతాల్లోని మిల్లుల యజమానులపై సివిల్ సప్లయ్ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదులు చేయడంతో కేసులు నమోదయ్యాయి. తాజాగా గడ్డిపల్లి, దిర్శినచర్లలోని శ్రీసంతోషిమా, తిరుమల మిల్లుల యజమానులపై ఆయా మండలపోలీ్‌సస్టేషన్లలో కేసులు నమోదు చేశారు.
బకాయిదారులపై చర్యలు తీసుకుంటున్నాం
జిల్లాలో సీఎంఆర్ లక్ష్యాన్ని పూర్తిచేస్తాం. ఇప్పటికే బకాయి బియ్యాన్ని మిల్లర్ల నుంచి సేకరించేందుకు చర్యలు చేపడుతున్నాం. గడువులోగా బియ్యం సరఫరా చేయాలని ఆదేశించాం. చేయని వారిపై చర్యలు చేపడుతున్నాం. గతంలో సీఎంఆర్ బకాయి ఉన్న మిల్లులకు ధాన్యం కేటాయింపులు చేయలేదు. వారిపై ఆర్‌ఆర్ యాక్టు అమలుకు చర్యలు తీసుకుంటున్నాం. తాజాగా 13వి ుల్లులకు నోటీసులు జారీ చేయనున్నాం.
- ప్రసాద్, జిల్లా సివిల్ సప్లయి మేనేజర్ సూర్యాపేట.