Share News

ఎస్‌.లింగోటంలో పీఏసీఎస్‌పై చిగురిస్తున్న ఆశలు

ABN , Publish Date - Jan 18 , 2025 | 01:03 AM

మండలంలోని ఎస్‌. లింగోటం ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం ( పీఏసీఎ్‌స)ను పునరుద్ధరించేందుకు కసరత్తు జరుగుతోంది.

ఎస్‌.లింగోటంలో  పీఏసీఎస్‌పై చిగురిస్తున్న ఆశలు

చౌటుప్పల్‌ టౌన, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): చౌటుప్పల్‌ మండలంలోని ఎస్‌. లింగోటం ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం ( పీఏసీఎ్‌స)ను పునరుద్ధరించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ గ్రామంలో పీఏసీఎ్‌సకు సొంత భవనాలతో పాటు ఇతర మౌలిక వసతులు ఉండడం అనుకూల అంశంగా పరిగణించవచ్చు. ఇక్కడ ఎరువుల గోదాంను నిర్మించేందుకు నాబార్డు నుంచి రూ.40 లక్షలు మంజూరు కావడంతో త్వరలోనే కార్యరూపం దాల్చనుంది. ఈ స్థలానికి ప్రస్తుతం ప్రహరీగోడను నిర్మించారు. మండలంలో ఒకే ఒక పీఏసీఎస్‌ ఉండడంతో రైతులకు రుణాలను అందించడంతో పాటు రికవరీలో కూడా సిబ్బంది అనేక ఇబ్బందులు పడవలసి వస్తోంది. చౌటుప్పల్‌లోని పీఏసీఎ్‌సకు శివారు గ్రామాలు సుమారు 12 నుంచి 15కిలోమీటర్ల దూరం ఉండడంతో రైతులు రుణాలు, చెల్లింపులకు ఒక రోజంతా కేటాయించవలసి వస్తోంది.

2005లో పీఏసీఎస్‌ తొలగింపు

ఎస్‌.లింగోటం గ్రామంలోని పీఏసీఎ్‌సను 2005 లో తొలగించి చౌటుప్పల్‌ పీఏసీఎ్‌సలో విలీనం చేశారు. దీంతో మండలం మొత్తంగా ఒకే ఒక పీఏసీఎ్‌సగా మారిపోయింది. ఈ పరిణామంతో ఆయా ప్రాంతాల రైతులకు తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. 26 గ్రామ పంచాయతీలతో పాటు మునిసిపాలిటీతో కూడుకున్న చౌటుప్పల్‌ మండలంలో ఒకే ఒక్క పీఏసీఎస్‌ ఉండడంతో శివారు ప్రాంత రైతులకు అందుబాటులో లేకుండ పోయింది. మండలంలో ఒకే ఒక పీఏసీఎస్‌ ఉండడంతో రైతులకు సరియైున సేవలు అందడంలేదని పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుతం పీఏసీఎస్‌ పరిధిలో 5,466 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు.

జనరల్‌ బాడీ సమావేశంలో..

మండల పరిధిలోని ఎస్‌.లింగోటం గ్రామంలోని పీఏసీఎ్‌సను పునరుద్ధరించాలని డీసీసీబీని కోరుతూ 2024 సెప్టెంబరు 28వ తుదీన జరిగిన జనరల్‌ బాడీ సమావేశంలో రైతులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సంఘం పరిధిలోకి పంతంగి, నేలపట్ల, ఎస్‌. లింగోటం, జైకేసారం, కుంట్లగూడెం, ఆరెగూడెం, గుండ్లబావి గ్రామ పంచాయతీలను కేటాయిస్తూ ప్రతిపాదనలను రూపొందించారు. ఈ ప్రతిపాదనలను పాలకవర్గ సమావేశంలో కూడ తీర్మానించి ఈ నెల 7వ తుదీన డీసీసీబీ చైర్మన కుంభం శ్రీనివా్‌సరెడ్డికి పంపించారు. ఎస్‌.లింగోటం పీఏసీఎ్‌సకు కేటాయించిన ఏడు గ్రామ పంచాయతీల పరిధిలో 1859 మంది ఓటు హక్కు కలిగిన రైతులు సభ్యులుగా ఉన్నారు.

ఎమ్మెల్యే దృష్టికి..

ఎస్‌.లింగోటం పీఏసీఎ్‌సను పునరుద్ధరించాలని కోరుతూ చేసిన తీర్మాణం, ప్రతిపాదనల విషయాన్ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన కుంభం శ్రీనివాస్‌ రెడ్డి ల దృష్టికి చౌటుప్పల్‌ పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన చెన్నగోని అంజయ్య గౌడ్‌ (కాంగ్రెస్‌) తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే. డీసీసీబీ చైర్మన్లు సానుకూలంగా ఉండడంతో ఎస్‌.లింగోటం లోని పీఏసీఎస్‌ను పునరుద్ధరించడం ఖాయమని అంజయ్యగౌడ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రతిపాదనలు పంపించాం

మండల పరిధిలోని ఎస్‌.లింగోటం పీఏసీఎస్‌ను పునరుద్ధరించాలని కోరుతూ ఈ నెల 7వ తేదీన డీసీసీబీకి ప్రతిపాదనలను పంపించాం. రుణాల వసూళ్లలో వెనకబడిందన్న సిఫారసుతో 2005 లో ఈ సంఘాన్ని రద్దు చేశారు. దీంతో మండలం మొత్తం ఒకే ఒక పీఏసీఎ్‌సగా మారిపోయింది.

-వై.రమేష్‌ గౌడ్‌, సెక్రటరీ, పీఏసీఎస్‌ చౌటుప్పల్‌

Updated Date - Jan 18 , 2025 | 01:04 AM