Share News

చండూరులో బీఆర్‌ఎస్‌ నాయకుడి అరెస్ట్‌

ABN , Publish Date - Feb 15 , 2025 | 12:52 AM

చండూరు, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా చండూరులో బీఆర్‌ఎస్‌ నాయకుడు, 4వ వార్డు మాజీ కౌన్సిలర్‌ అన్నెపర్తి శేఖర్‌ను పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్టు చేయడం కలకలం రేపింది.

చండూరులో బీఆర్‌ఎస్‌ నాయకుడి అరెస్ట్‌

చండూరు, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా చండూరులో బీఆర్‌ఎస్‌ నాయకుడు, 4వ వార్డు మాజీ కౌన్సిలర్‌ అన్నెపర్తి శేఖర్‌ను పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్టు చేయడం కలకలం రేపింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత శేఖర్‌ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన్ను అరెస్టుచేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో గుర్తు తెలియని వ్యక్తులు, ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఆయన ఇంటిపై దాడి చేసి కిడ్నాప్‌ చేశారని పట్టణంలో కలకలం రేగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చండూరుకు చెందిన చిట్టిప్రోలు మహేష్‌ పట్టణంలో ఆటోమొబైల్‌ దుకాణం నిర్వహిస్తున్నాడు. మహేష్‌కు, వార్డు మాజీ కౌన్సిలర్‌ అన్నెపర్తి శేఖర్‌కు లావాదేవీల విషయంలో వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీన ఆయన మహేష్‌ దుకాణానికి వెళ్లి తనకు డబ్బులు ఇవ్వాలని, అసభ్యంగా తిడుతూ దాడి చేసి, భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ ఘటనలో గాయాలపాలైన మహేష్‌ ఆసుపత్రిలో చికిత్స పొందా డు. శేఖర్‌ తనపై హత్యాయత్నం చేశాడని అదే రోజు చండూరు పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమో దుచేసి శుక్రవారం తెల్లవారుజామున అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించినట్లు చండూరు సీఐ వెంకటయ్య తెలిపారు.

అధికార పార్టీ నేతల ప్రోద్భలంతోనే..

ఈ సందర్భంగా శేఖర్‌ భార్య, చండూరు మాజీ జడ్పీటీసీ సంతోష, కుటుంబసభ్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తన భర్త శేఖర్‌ను అర్ధరా త్రి సమయంలో తమ ఇంట్లో నిద్రిస్తున్న క్రమంలో పోలీసులను తలుపులు కొట్టి నిద్రలేపారని, కారులో వచ్చి భర్తను తీసు కువెళ్లారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త ఆచూకీ అడిగినా స్థానిక పోలీసులు సమాచారం ఇవ్వకపోవడంతో అయోమయానికి గురైనట్లు తెలిపారు. ఎట్టకేలకు పోలీసులు తీసుకెళ్లారని తెలిసిందన్నారు. తాను జడ్పీటీసీ గా, తన భర్త పట్టణంలో వార్డు కౌన్సిలర్‌గా ఐదేళ్లు ప్రజలకు సేవ చేశామ ని, కావాలనే అధికార పార్టీకి చెందిన నేతల ప్రోద్బలంతోనే అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు.

రాజకీయ కక్షతోనే కేసుల నమోదు : బీఆర్‌ఎస్‌

రాజకీయ కక్షలతోనే మునిసిపల్‌ మాజీ కౌన్సిలర్‌ అన్నెపర్తి శేఖర్‌పై అక్రమ కేసులు బనాయించారని బీఆర్‌ఎస్‌ మండ్చజ్ఛుధ్యక్షుడు బొమ్మరబోయిన వెంక న్న ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలన అరాచకాలను ప్రశ్నిస్తే, వారి ఇళ్లపై అర్ధరాత్రి దాడులు చేసి కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్న ఆగడాలను చూస్తూ ఊరుకోబోరని హెచ్చరించారు.

Updated Date - Feb 15 , 2025 | 12:52 AM