Share News

అప్పు చేసి పప్పు కూడు

ABN , Publish Date - Feb 12 , 2025 | 01:08 AM

బడుగు, బలహీన వర్గాల పిల్లల కు విద్యను దగ్గర చే యాలనే తలంపుతో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభు త్వ పాఠశాలల్లో అమలుచేస్తోంది. ఈ పథకం అమలుకు ప్రభుత్వం ఏజెన్సీలను నియమించింది. అందుకు అవసరమైన బియ్యం మినహా ఇతర నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసినందుకు ఏజెన్సీలకు ప్రభుత్వం నెలనెలా బిల్లులు చెల్లించాలి.

అప్పు చేసి పప్పు కూడు

ఐదు నెలలుగా మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు అందని బిల్లులు

కోదాడ, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): బడుగు, బలహీన వర్గాల పిల్లల కు విద్యను దగ్గర చే యాలనే తలంపుతో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభు త్వ పాఠశాలల్లో అమలుచేస్తోంది. ఈ పథకం అమలుకు ప్రభుత్వం ఏజెన్సీలను నియమించింది. అందుకు అవసరమైన బియ్యం మినహా ఇతర నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసినందుకు ఏజెన్సీలకు ప్రభుత్వం నెలనెలా బిల్లులు చెల్లించాలి. కాగా, 1 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి సంబంధించి ప్రతీ నెల బిల్లులను ప్రభుత్వం చెల్లిస్తుండగా, హైస్కూల్‌ పరిధిలో ఉండే 9, 10వ తరగతి విద్యార్థులకు చెందిన బిల్లులు మాత్రం ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఏజెన్సీల నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 580 ఏజెన్సీలు ఉన్నాయి. హైస్కూల్‌ విద్యార్థులకు ఒక్కొక్కరి కి ప్రభుత్వం రూ.10.67 చెల్లిస్తోంది. కాగా, 9, 10వ తరగతి విద్యార్థుల చెందిన బిల్లులు గత ఏడాది సెప్టెంబరు నుంచి ప్రభుత్వం బకాయి పడింది. ఈ మొత్తం సుమారు రూ.3,64,91,000 వరకు ఉంది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో బిల్లులు రాకపోవడం, ఐదు నెలలుగా గౌరవ వేతనాలు చెల్లించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అప్పు చేసి విద్యార్థులకు వండి పెడుతున్నామని ఏజెన్సీ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో 580 ఏజెన్సీలు

ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 580 వరకు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో సుమారు 34,200మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈపాఠశాలల్లో 580మధ్యాహ్న వంట ఏజెన్సీలు ఉన్నాయి. 9,10వతరగతి వి ద్యార్థులకు ప్రభుత్వం రోజుకు రూ.10.67 చొప్పున చెల్లించాలి. ఈలెక్కన నెల కు సుమారు రూ.73లక్షలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఐదు నెలలుగా బిల్లులు రాకపోవడంతో బకాయి రూ.3.65కోట్లకు చేరింది.

అప్పుచేసి సరుకులు తెస్తున్నాం : శివరాత్రి సుజాత, నిర్వాహకురాలు

బిల్లులు రాకపోవడంతో ప్రతీ రోజు ఇబ్బందులు పడి సరుకులు కొనుగోలు చేసి తెస్తున్నాం. తెలిసిన వారి వద్ద వడ్డీకి డబ్బు తెచ్చి సరుకులు కొనుగోలుచేస్తున్నాం. అటు కూలి గిట్టుబాటుగాక, ఇటు వడ్డీ పెరిగి ఆర్థిక భారం పడుతోం ది. అధికారులను అడిగితే పైనుంచి రానిదే తామేం చేయలేమంటున్నారు. కిరాణా దుకాణంలో ఇప్పటికే రూ.50వేలు బాకీ దాటింది. పాతబాకీ చెల్లిస్తేనే సరుకులు ఇస్తామంటున్నారు. ప్రభుత్వం వెంటనే బిల్లులు మంజూరు చేసి ఆదుకోవాలి. అదే విధంగా గౌరవ వేతనం ఐదు నెలలుగా రావడం లేదు. వెంటనే బిల్లులతోపాటు గౌరవ వేతనం కూడా చెల్లించాలి.

Updated Date - Feb 12 , 2025 | 01:08 AM