Share News

10జీపీఏ తెచ్చుకున్న ప్రభుత్వ విద్యార్థులందరికీ సైకిళ్లు

ABN , Publish Date - Feb 26 , 2025 | 01:00 AM

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటూ పదో తరగతిలో 10 జీపీఏ తెచ్చుకున్న విద్యార్థులందరికీ సైకిళ్లు బహుమతిగా ఇచ్చి, వారి తల్లిదండ్రుల ను సన్మానిస్తానని కలెక్టర్‌ హనుమంతరావు అన్నా రు.

10జీపీఏ తెచ్చుకున్న ప్రభుత్వ విద్యార్థులందరికీ సైకిళ్లు

ఇష్టంతో చదువుతూ శ్రద్ధగా పరీక్షలు రాయాలి

కలెక్టర్‌ హనుమంతరావు

భువనగిరి టౌన్‌, ఫిబ్రవరి25(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటూ పదో తరగతిలో 10 జీపీఏ తెచ్చుకున్న విద్యార్థులందరికీ సైకిళ్లు బహుమతిగా ఇచ్చి, వారి తల్లిదండ్రుల ను సన్మానిస్తానని కలెక్టర్‌ హనుమంతరావు అన్నా రు. పదో తరగతి పరీక్షల పై ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్ట ళ్ల విద్యార్థులకు మంగళవారం భువనగిరిలో నిర్వహించిన అవగాహనా సదస్సులో ఆయన మాట్లాడారు. పరీక్షల భయాన్ని వీడితేనే ఉత్తమ ఫలితాలు సాధ్యమన్నారు. ఏడాదిపాటు నేర్చుకున్న పాఠ్యాంశాలను పరీక్షల ముందు మరోసారి ఇష్టంతో చదివి శ్రద్ధగా పరీక్షలు రాయాలన్నారు. పరీక్షల ముందు పత్యేక ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలన్నారు. అదనపు కలెక్టర్‌ గంగాధర్‌, డీఈవో కె.సత్యనారాయణ పరీక్షల సన్నద్ధత, పరీక్షల నిర్వహణ తీరుపై వివరించారు. జిల్లా అధికారులు యాదయ్య, వసంత కుమా రి, మందడి ఉపెందర్‌ రెడ్డి, ఏఎ్‌సడబ్ల్యూవో తారాబాయి, హెచ్‌డబ్ల్యూఓఎ్‌స జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఇమ్మాన్యూల్‌, శైలజ తదితరులు పాల్గొన్నారు.

వలిగొండ: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని కలెక్టర్‌ హనుమంతరావు అధికారులకు సూచించారు. మంగళవారం మండలకేంద్రంలోని వేంకటేశ్వర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ నెల 27న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో ధరణి రికార్డులను పరిశీలించారు. సర్టిఫికెట్లు పెండింగ్‌లో ఉండకుండా చూడాలని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్‌ శ్రీని వా్‌సరెడ్డి తదితరు లు ఉన్నారు.

రంజాన్‌కు ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్‌

భువనగిరి (కలెక్టరేట్‌): మత సామరస్యానికి ప్రతీ క రంజాన్‌ అని, ఈ పండుగకు అన్ని ఏర్పాట్లు చే యాలని కలెక్టర్‌ ఎం.హనుమంతరావు అన్నారు. రం జాన్‌ మాసం ప్రారంభం సందర్భంగా శాంతి సంఘం సమావేశాన్ని కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించా రు. రంజాన్‌ మాసం కోసం సంబంధిత శాఖలకు కే టాయించిన అధికారులు తమ విధులను సమన్వయంతో నిర్వహించాలన్నారు. భువనగిరి జోన్‌ డీసీపీ రాజే్‌షచంద్ర మాట్లాడుతూ పవిత్ర రంజాన్‌ మాసం లో మసీదుల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జీ.వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ గంగాధర్‌, ఏసీపీ రాహుల్‌రెడ్డి, జిల్లా రవాణాధికారి సాయిక్రిష్ణ, డీఎంహెచ్‌వో మనోహర్‌, భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2025 | 01:00 AM