Share News

బాలుడిపై లైంగిక దాడి యత్నం

ABN , Publish Date - Jan 04 , 2025 | 12:17 AM

బాలుడిపై లైంగిక దాడికి యత్నించిన యువకుడిపై పోక్సో కేసు నమోదైంది.

బాలుడిపై లైంగిక దాడి యత్నం

సూర్యాపేటక్రైం, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): బాలుడిపై లైంగిక దాడికి యత్నించిన యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. ఈ నెల 1వ తేదీన సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ ఘటన జరిగింది. సూర్యాపేట పట్టణ ఇనస్పెక్టర్‌ వీరరాఘవులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రానికి చెందిన సాయిగణేష్‌ తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సాయిగణేష్‌ ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు. ఈ నెల 1వ తేదీన తన ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న 11 ఏళ్ల బాలుడికి మాయమాటలు చెప్పి బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో బాలుడు తల్లిదండ్రులు వారి వారి పనులకు వెళ్లగా ఇంట్లో బాలుడొక్కడే ఉన్నాడు. బాలుడిపై లైంగిక దాడికి యత్నించటంతో అక్కడినుంచి తప్పించుకుని బయటకు వచ్చి అటుగా వెళుతున్న స్థానికులకు జరిగిన విషయాన్ని తెలిపాడు. అనంతరం తల్లిదండ్రులకు బాలుడు సమాచారం ఇవ్వగా వారు పట్టణ పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో లైంగిక దాడికి యత్నించిన సాయిగణేష్‌పై ఈ నెల 2వ తేదీన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పట్టణ ఇనస్పెక్టర్‌ వీరరా ఘవులు తెలిపారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిపారు.

Updated Date - Jan 04 , 2025 | 12:17 AM