Share News

గుట్ట బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేయాలి

ABN , Publish Date - Mar 05 , 2025 | 01:28 AM

యాదగిరిగుట్టలో ఈ నెల 11వ తేదీ వరకు జరగనున్న లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకు వచ్చే ప్రజాప్రతినిధులకు, భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఎం.హనుమంతరావు అన్నారు.

గుట్ట బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేయాలి

కలెక్టర్‌ హనుమంతరావు

భువనగిరి (కలెక్టరేట్‌), మార్చి 4 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్టలో ఈ నెల 11వ తేదీ వరకు జరగనున్న లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకు వచ్చే ప్రజాప్రతినిధులకు, భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఎం.హనుమంతరావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భక్తులకు మౌలిక వసతులు కల్పించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆలయ భద్రత, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు పూర్తిస్ధాయి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పోలీ్‌సశాఖ, అగ్నిమాపకశాఖ, వైద్యఆరోగ్యశాఖ, పారిశుధ్యం నిర్వహణకు పంచాయతీరాజ్‌శాఖ సమన్వయంతో పనిచేస్తూ నిత్యం పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, యాదగిరిగుట్ట ఆలయ ఈవో భాస్కర్‌రావు, అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ, భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి, ఏసీపీ రమే్‌షకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 05 , 2025 | 01:28 AM