రూ.3.5 లక్షలిస్తే ఎకరా భూమి
ABN , Publish Date - Mar 05 , 2025 | 12:13 AM
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నకిలీపా్‌సపుస్తకాలు కలకలకం రేపాయి డబ్బులు ఇస్తే అటవీ భూములపై పట్టా పాస్‌బుక్‌లు ఇప్పిస్తామని దళారీ ముఠా పలువురిని మోసం చేసింది.

తిరుమలగిరి(సాగర్) మండల అటవీ భూములు పట్టా చేయిస్తామని మోసం
మిర్యాలగూడలో 100 మందికి పైగా టోకరా
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నకిలీపా్‌సపుస్తకాలు కలకలకం రేపాయి డబ్బులు ఇస్తే అటవీ భూములపై పట్టా పాస్‌బుక్‌లు ఇప్పిస్తామని దళారీ ముఠా పలువురిని మోసం చేసింది. ఎకరానికి రూ.3.5 లక్షల చొప్పున మిర్యాలగూడకు చెందిన వ్యక్తితో డీల్ కుదుర్చుకుని 4.27 ఎకరాలకు ఇచ్చిన పాస్‌బుక్ నకిలీదని తేలడంతో దందా విషయం వెలుగుచూసింది. ఇటీవల పైలెట్ ప్రాజెక్టుగా తిరుమలగిరి(సాగర్) మండలంలో చేపట్టిన సర్వే ఆధారంగా దోపిడీకి దళారీ ముఠా పఽథక రచన చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
(ఆంధ్రజ్యోతి-మిర్యాలగూడ)
మిర్యాలగూడ డివిజనలో దామరచర్ల, అడవిదేవులపల్లి, త్రిపురారం, తిరుమలగిరి(సాగర్), పెద్దవూర మండలాల్లో అటవీభూములు విస్తరించి ఉన్నాయి. ఏళ్ల తరబడి అటవీ భూములను సాగు చేసుకుంటున్న రైతులు ఆయా భూములపై పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు. అటవీ భూముల సర్వేకు ప్రభుత్వం డివిజన పరిధిలోని తిరుమలగిరి(సాగర్)ను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుంది. డివిజనలోని సర్వేయర్లందరినీ అక్కడే మోహరించి సర్వే పూర్తిచేసింది. అర్హులైన రైతుల జాబితాను రూపొందించి అన్నిగ్రామాల వారికి పాస్‌పుస్తకాలు సీఎం నుంచి ఒకేసారి పంపిణీ చేసేందుకు అధికారులు పాస్‌పుస్తకాల ముద్రణ పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. తమకు తెలిసిన అధికారులు ఉన్నారని, డబ్బులిస్తే ఆ భూములపై పట్టాలు ఇప్పిస్తామని గిరిజన తెగకు చెందిన కొందరు దళారుల ముఠా ఆశ చూపెట్టి పట్టణానికి చెందిన పలువురు నుంచి రూ.వేలల్లో డబ్బులు వసూలు చేసింది. మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఓ ప్రైవేటు పాఠశాల యజమానికి ఇలాగే 10 ఎకరాల అటవీ భూమికి పట్టా ఇప్పించగా దానిని ఏడాది నుంచి కూరగాయల సాగు చేసుకుంటున్నట్లు చెబుతూ దళారులు బాధితులతో చెప్పినట్లు తెలుస్తోంది. చాలాకాలం నుంచి ముఠా సభ్యులు ఈ రకమైన మోసానికి పాల్పడుతన్నట్లు అనుమానిస్తున్నారు.