సామాజిక నిబద్ధత కలిగిన సీఎం.. రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Feb 08 , 2025 | 12:35 AM
మిర్యాలగూడ, ఫిభ్రవరి 7(ఆంధ్రజ్యోతి): సామాజిక న్యాయ నిబద్ధత కలిగిన సీఎం రేవంత్‌రెడ్డి అని మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు.

మిర్యాలగూడ, ఫిభ్రవరి 7(ఆంధ్రజ్యోతి): సామాజిక న్యాయ నిబద్ధత కలిగిన సీఎం రేవంత్‌రెడ్డి అని మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఓ ప్రైవేటు కార్య క్రమానికి హాజరైన ఆయన శుక్రవారం విలే కరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బాగా పని చేస్తుం దన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలోనూ, బీసీ గణనలోనూ దేశంలో తెలంగాణ ఇతర రాష్ర్టాలకు స్ఫూర్తి దాయకంగా ఉందని, ఆంధ్రా, తెలంగాణ మాదిగల తరుపున ప్రతేక అభినం దనలు తెలుపుతున్నట్లు చెప్పారు. 30 ఏళ్లుగా ఎస్సీల వర్గీకరణ కోసం గొప్ప ఉద్యమాన్ని నడిి పిన మందకృష్ణకు ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి సత్కరించిందని, వచ్చే ఏడాదికి పద్మ భూషణ్ ఇచ్చి సత్కరించాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు చెప్పారు. సామాజిక న్యాయం విషయంలో అయనకు ప్రత్యేక విజన్ ఉందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన వర్గీకరణ బిల్లులో రెల్లి, గోసంగి, మాదరి, పాకీ, మాంగ్ లాంటి ఉపకులాలు కేటగిరీల కూర్పు లో తేడాలు చోటు చేసుకున్నాయన్నారు. ఏ లో ఉండాల్సి కొన్ని ఉప కులాలు సీ లో ఉన్నాయని, సీలో ఉండాల్సినవి ఏలో చేర్చారని వీటిపై సమ గ్రంగా చర్చించి వీలుంటే మార్చాలని అన్నారు. రాజకీయ పదవుల్లో ఎస్సీలకు 12 శాతం రిజర్వే షన్లు కల్పించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఐక్యంగా ఉండి సామాజికంగా ఉన్నతిని సాధిం చాలని కోరారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ జాతీయ కోర్‌కమిటీ సభ్యులు దైద సత్యం, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎడ్ల రమేష్, టీడీపీ రాష్ట్ర నాయకులు బొజ్జ సత్యనారాయణ, నేరేడుచర్ల మాజీ జడ్పీటీసీ రాపోలు నర్సయ్య పాల్గొన్నారు.