Share News

కందిపోతోన్న ధర

ABN , Publish Date - Jan 25 , 2025 | 01:19 AM

పప్పు ధాన్యాలకు మద్దతు ధర కరువైంది. కందుల కొనుగోళ్లలో వ్యాపారులు చెప్పిందే ధరగా చెలామణి అవుతోంది. ఉమ్మడి నల్లగొం డ జిల్లాలో దిగుబడి తక్కువగా ఉండడం, సీజన్‌కు ముందు కనీస మద్దతు ధరకంటే ఎక్కువ ధర బహిరంగ మార్కెట్లో లభిస్తే, రైతుల నుం చి కందులు మార్కెట్‌కు రావడం మొదలయ్యా క వ్యాపారులు ధర తగ్గించేశారు.

కందిపోతోన్న ధర

కందులకు దక్కని మద్దతు ధర

మార్కెట్‌కు వచ్చే క్రమంలో తగ్గిన ధర

మద్దతు ధర రూ.7,550.. రూ.6వేలకు మించని ఽవైనం

నల్లగొండ, జనవరి 24 (ఆంధ్రజ్యోతిప్రతినిఽ ది): పప్పు ధాన్యాలకు మద్దతు ధర కరువైంది. కందుల కొనుగోళ్లలో వ్యాపారులు చెప్పిందే ధరగా చెలామణి అవుతోంది. ఉమ్మడి నల్లగొం డ జిల్లాలో దిగుబడి తక్కువగా ఉండడం, సీజన్‌కు ముందు కనీస మద్దతు ధరకంటే ఎక్కువ ధర బహిరంగ మార్కెట్లో లభిస్తే, రైతుల నుం చి కందులు మార్కెట్‌కు రావడం మొదలయ్యా క వ్యాపారులు ధర తగ్గించేశారు. ఉత్పత్తి తక్కువగా ఉండడం, బహిరంగ మార్కెట్లో మద్దతు ధరకు మించి ధర లభిస్తున్న క్రమం లో మార్క్‌ఫెడ్‌ సైతం కేంద్రాల ఏర్పాటులో జా ప్యం చేయడం రైతులకు ఇబ్బందికరంగా మా రింది. మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో సూర్యాపేట జి ల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా కొనుగోళ్లు జరగలే దు. మరోవైపు నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో ఉమ్మడి జిల్లాలో కందులకు మద్దతు ధర దక్కకపోవడంతో రైతులు నష్టపోతున్న పరిస్థితి నెలకొంది.

వ్యాపారులు ధర తగ్గించడంతో రైతుల బేజార్‌

కందులకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.7,550 కాగా, ప్రస్తుతం ఒక్క సూర్యాపేట మార్కెట్లో మాత్ర మే క్వింటాల్‌కు కనీస మద్దతు ధరకు సరిసమానంగా ధర లభిస్తుంటే, నల్లగొండ, యాదా ద్రి జిల్లాల్లోని నల్లగొండ, హాలియా, నకిరేకల్‌, భువనగిరి, ఆలేరు, మోత్కూరులో ధర క్వింటా కు రూ.5,500 నుంచి రూ.6వేలకు లోబడి మాత్రమే లభిస్తోంది. సూర్యాపేటలో మార్క్‌ఫెడ్‌ కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు, ఎగుమతిదారులు సైతం ఇక్కడ కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో ఈ మార్కెట్లో ధర లభిస్తుంది. ఉమ్మడి జిల్లాలో కందుల కల్లాలు ముగిసి విక్రయానికి కందులు వస్తున్న తరుణంలో ధర లేకపోవడంతో రైతులకు పెట్టుబడులు సైతం దక్కని దుస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో ఈ సీజన్‌లో 10,326 ఎకరాల్లో కంది సాగుచేయగా, 48,020 క్వింటాళ్ల కందుల ఉత్పత్తి వస్తుందని అంచనావేశారు. కంది పంటను వానాకాలం సాగులో పత్తిలో అంతరపంటగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికంగా సాగవడంతో పాటు, ప్రత్యేకంగా కంది సాగు కూడా ఈ దఫా అత్యధికంగా సాగయింది. వ్యవసాయశాఖ నమోదు లో కేవలం ప్రత్యేక సాగునే పేర్కొనడం, దిగుబడులు సైతం గరిష్టంగా నాలుగు క్వింటాళ్లే నమోదు చేయడంతో వాస్తవ ఉత్పత్తి అంతకుమించి వచ్చిందని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారుల అంచనా ప్రకారం వచ్చే 48,020 క్వింటాళ్లు అయితే, వాస్తవానికి ఇంతకు రెట్టింపుగా ఉత్పత్తి వచ్చిందని, దీనిని అధికారులు అంచనా వేయలేకపోవడంతోనే మార్కెట్లో రైతులకు విక్రయాలకు ఇబ్బంది ఎదురవుతుందని చెబుతున్నారు. మార్క్‌ఫెడ్‌ అధికారులు స్పందించి ఇప్పటికైనా రైతులకు. మద్దతు ధర దక్కేలా సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో జిల్లాకు ఒక్క కొనుగోలు కేంద్రమైనా ఏర్పాటు చేయించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

కేంద్రాలు ఏర్పాటు చేయిస్తాం: జ్యోతి, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, మార్క్‌ఫెడ్‌

ప్రభుత్వ మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్లోనే కందులకు ఎక్కువ ధర లభిస్తున్నందున నల్లగొండ జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. రైతులకు మద్దతు ధర ఇప్పించేందుకు కృషి చేస్తాం. తక్షణమే నల్లగొండ జిల్లాలో మార్క్‌ఫెడ్‌ కేంద్రాన్ని అందుబాటులోకి తెస్తాం. రైతులెవరూ మద్దతు ధర కంటే తక్కువ ధరకు కందులు అమ్మాల్సిన అవసరం లేదు.

Updated Date - Jan 25 , 2025 | 01:19 AM