సీజ్ చేసిన 483 కిలోల గంజాయి నిర్వీర్యం
ABN , Publish Date - Jan 18 , 2025 | 01:01 AM
జిల్లావ్యాప్తంగా 44 కేసుల్లో స్వాధీనం చేసుకున్న రూ.1.20 కోట్ల విలువైన 483 కిలోల గంజాయినీ ప్రభుత్వ, కోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వీర్యం చేసినట్లు కమిటీ చైర్మన, ఎస్పీ సనప్రీతసింగ్ తెలిపారు.

మఠంపల్లి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా 44 కేసుల్లో స్వాధీనం చేసుకున్న రూ.1.20 కోట్ల విలువైన 483 కిలోల గంజాయినీ ప్రభుత్వ, కోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వీర్యం చేసినట్లు కమిటీ చైర్మన, ఎస్పీ సనప్రీతసింగ్ తెలిపారు. మఠంపల్లి మండలంలోని నాగార్జున సిమెంట్ పరిశ్రమలో 1000 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన అత్యాధునిక సాధనంలో గంజాయిని నిర్వీర్యం చేసి బూడిద చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్ నివారణ సామాజిక బాధ్యత అని, గంజాయి వినియోగించడంతో యువత చెడుమార్గంలోకి వెళ్లి భవిష్యతను నాశనం చేసుకుంటోందన్నారు. డ్రగ్ రవాణా వినియోగం నేరమని, గంజాయి నివారణలో జిల్లా పోలీసుల కృషి మరువలేనిదన్నారు. ఎక్కడైనా డ్రగ్ విక్రయించినా, రవాణా చేస్తున్నా, వినియోగిస్తున్నా డయల్-100కు సమాచారం అందించాలన్నారు. డ్రగ్, గంజాయి నిర్మూలన, అనర్ధాలపై ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ప్రతీ తల్లిదండ్రులు పిల్లల నడవడికను, వారి అలవాట్లను గమనిస్తూ వ్యసనాలకు లోనుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేశ్వరావు, సూర్యాపేట, కోదాడ డీఏస్పీలు రవి, శ్రీధర్‌రెడ్డి, డీసీఆర్బీ డీఏస్పీ మట్టయ్య, హుజూర్‌నగర్ సీఐ చరమందరాజు, ఎస్‌ఐ యాకూబ్, పంచాయతీ కార్యదర్శులు సలీం, మామిడి స్వామి, పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు.