Share News

29,75,286 ఉమ్మడి జిల్లా ఓటర్లు

ABN , Publish Date - Jan 07 , 2025 | 12:34 AM

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 29,75,286 మంది ఓటర్లు నమోదయ్యారు. సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్‌ మేరకు ఉమ్మడి జిల్లాలోని ముగ్గురు జిల్లా ఎన్నికల అధికారులు ఈమేరకు తుది సవరణల అనంతరం ఓటర్ల జాబితాను ప్రచురించారు.

29,75,286 ఉమ్మడి జిల్లా ఓటర్లు

పురుషుల కన్నా మహిళలే ఎక్కువ

దేవరకొండ నియోజక వర్గంలో అత్యధిక ఓటర్లు

భువనగిరిలోతక్కువ ఓటర్లు

అత్యధిక మహిళాఓటర్లున్నది ఆ ఆరు నియోజకవర్గాల్లోనే..

(ఆంధ్రజ్యోతిప్రతినిధి-నల్లగొండ): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 29,75,286 మంది ఓటర్లు నమోదయ్యారు. సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్‌ మేరకు ఉమ్మడి జిల్లాలోని ముగ్గురు జిల్లా ఎన్నికల అధికారులు ఈమేరకు తుది సవరణల అనంతరం ఓటర్ల జాబితాను ప్రచురించారు. ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 3,583 పోలింగ్‌ స్టేషన్లు నిర్దారించారు. మొత్తం ఓటర్లలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండడం విశేషం.

ఉమ్మడి జిల్లాలోని 12 శాసనసభా నియోజవకర్గాలకు 14,63,142 మంది పురుష ఓటర్లు, 15,11,939 మంది మహిళా ఓటర్లు నమోదయ్యారు. ట్రాన్స్‌జెండర్లు 205 మంది ఓటుహక్కు నమోదు చేసుకున్నారు. 12 నియోజకవర్గాల్లో దేవరకొండలో అత్యధికంగా 2,64,430 మంది ఓటర్లు నమోదవగా, భువనగిరిలో అత్యల్పంగా 2,22,651 మంది ఓటర్లు నమోదయ్యారు. మొత్తం ఉమ్మడి జిల్లాలో దేవరకొండ నియోజకవర్గంలో అత్యధికంగా మహిళా ఓటర్లున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో మహిళలకంటే పురుష ఓటర్లే ఎక్కువగా ఉండడం గమనార్హం. దేవరకొండ, తుంగతుర్తి, హుజూర్‌నగర్‌, నకిరేకల్‌, నల్లగొండ, కోదాడ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా నమోదయ్యారు. దేవరకొండ నియోజకవర్గం మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో పురుష ఓటర్లకంటే మహిళల ఓటర్లే ఎక్కువగా నమోదయ్యారు. ప్రస్తుత ఓటర్ల జాబితానే పైనల్‌ కాదని, కొత్తఓటర్లు, మార్పులు, చేర్పులు, సవరణలను ఎప్పటికప్పుడు కొనసాగించాలని ఎన్నికల జిల్లా అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది.

నియోజకవర్గం పోలింగ్‌ పురుషులు మహిళలు ఇతరులు మొత్తం

కేంద్రాలు

దేవరకొండ (ఎస్టీ) 326 1,32,611 1,31,800 19 2,64,430

నాగార్జునసాగర్‌ 306 1,16,278 1,21,300 19 2,37,597

మిర్యాలగూడ 264 1,16,222 1,21,313 26 2,37,561

నల్లగొండ 288 1,22,222 1,29,133 56 2,51,411

మునుగోడు 317 1,29,235 1,30,688 3 2,59,926

నకిరేకల్‌ 311 1,25,991 1,29,316 4 2,55,311

హుజూర్‌నగర్‌ 311 1,22,663 1,30,430 17 2,53,110

కోదాడ 296 1,20,150 1,27,077 20 2,47,247

సూర్యాపేట 271 1,19,999 1,26,424 14 2,46,437

తుంగతుర్తి 327 1,29,654 1,31,697 6 2,61,357

భువనగిరి 257 1,09,820 1,12,830 1 2,22,651

ఆలేరు 309 1,18,297 1,19,931 20 2,38,248

మొత్తం 3,583 14,63,142 15,11,939 205 29,75,286

జిల్లాలో మహిళా ఓటర్లే అధికం

తుదిజాబితాను ప్రకటించిన ఈసీఐ

మొత్తం భువనగిరిలో 2,22,651 మంది, ఆలేరులో 2,38,248 మంది ఓటర్లు

యాదాద్రి, జనవరి6 (ఆంధ్రజ్యోతి): అన్నింటా ఆమె.. ఆకాశంలో సగం అంటూ చెప్పుకునే మహిళలు ఈసారి సగంకంటే ఎక్కువగానే ఓటరు జాబితాలో నమోదయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) విడుదల చేసిన ఓటరు జాబితాలో జిల్లాలో మహిళలే అధికంగా ఉండడం విశేషం. జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 4,60,899 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మొత్తం పరుషుల ఓటర్లు 2,28,117మంది, మహిళా ఓటర్లు 2,32,761మంది, ఇతరులు 21మంది ఓటర్లుగా లెక్క తేల్చారు. ఎన్నికల సంఘం 2024 నవంబరులో ముసాయిదా జాబితాను విడుదల చేసింది. ఈ సందర్భంగా జనవరి 2025లోగా 18 ఏళ్లు నిండిన యువతకు ఓటరు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. అదేవిధంగా ఓటర్ల మార్పులు, చేర్పులు అవకాశం కల్పించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని 2024 ఆగస్టు 20నుంచి ప్రారంభించింది. ఈ ప్రక్రియను అక్టోబరు 20వరకు కొనసాగించింది. ఓటరు జాబితాపై అభ్యంతరాలు ఉంటే మార్పులు, చేర్పులకోసం నవంబరు 9, 10 తేదీల్లో బూత్‌ లెవల్‌స్థాయిలు ప్రత్యేక శిబిరాలు నిర్వహించింది. సవరించిన ఓటరు జాబితాను అక్టోబరు 29న ప్రకటించింది. ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలోని భువనగిరి, ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4,58,426 మంది ఓటర్లున్నట్టుగా లెక్కతేల్చారు. 2025 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారితో మొత్తం 4,60,899 మంది ఓటర్లు నమోదు చేసుకున్నారు. తుదిజాబితాలో భువనగిరి నియోజకవర్గంలో మొత్తం 267 పోలింగ్‌స్టేషన్లకు పురుషులు 1,098,20 మంది ఓటర్లు, మహిళలు 1,12,830 మంది ఓటర్లు, ఇతరులు ఒకరు ఉన్నారు. ఆలేరు నియోజకవర్గంలో మొత్తం 309 పోలింగ్‌స్టేషన్లలో మొత్తం పురుషులు 1,18,297మంది ఓటర్లు, మహిళలు 1,19,931మంది ఓటర్లు, ఇతరులు 20మంది ఓటర్లు ఉన్నారు. ముసాయిదా జాబితా అనంతరం జిల్లాలో మొత్తం నూతనంగా 2,473 మంది ఓటర్లు నమోదయ్యారు.

రానున్న ఎన్నికల్లో వీరే కీలకం..

కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన తుది ఓటరు జాబితాలో జిల్లాలోని భువనగిరి ఆలేరు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. పురుషులు 1,09,820 మంది ఓటర్లు, మహిళలు 1,12,830మంది ఓటర్లు ఉండగా, పురుషుల కంటే మహిళా ఓటర్లు 3,010 మంది అధికంగా ఉన్నారు. అదేవిధంగా ఆలేరు నియోజకవర్గంలో మొత్తం పురుషులు 1,18,297 మంది ఓటర్లు, మహిళలు 1,19,931 మంది ఓటర్లు ఉండగా, పురుషుల కంటే మహిళా ఓటర్లు 1,634మంది వరకు ఉన్నారు. రానున్న ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకంగా మారనున్నారు.

మండలం పోలింగ్‌స్టేషన్లు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం

భువనగిరి 99 42443 44586 1 87030

బీబీనగర్‌ 45 21161 21452 0 42613

పోచంపల్లి 50 21757 21964 0 43721

వలిగొండ- 62 24459 24828 0 49287

మొత్తం 257 109820 112830 1 222651

మండలం పోలింగ్‌స్టేషన్లు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం

బొమ్మలరామారం 40 14552 14797 2 29351

తుర్కపల్లి 39 13772 14059 0 27831

రాజపేట 40 14900 15166 0 30066

యాదగిరిగుట్ట 48 20202 20705 17 40924

ఆలేరు 41 17064 17831 1 34896

మోటకొండూరు 29 10440 10543 0 20983

గుండాల 35 13081 12823 0 25904

ఆత్మకూరు(ఎం) 34 12827 12574 0 25401

వలిగొండ 3 1459 1433 0 982

309 118297 119931 20 238248

Updated Date - Jan 07 , 2025 | 12:34 AM