పీహెచసీల్లో వైద్యుల కొరత
ABN , Publish Date - Feb 17 , 2025 | 12:16 AM
జిల్లాలోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత వెంటాడుతోంది. కొన్ని పీహెచసీల్లో అవసరానికి మించి వైద్యులు ఉండగా మరికొన్ని దవాఖానల్లో ఉండాల్సిన దానికి కన్న తక్కువ వైద్యులు విధులు నిర్వర్తించడం వైద్య ఆరోగ్య శాఖ తీరు విస్మ యానికి గురి చేస్తోంది.

జిల్లాలోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత వెంటాడుతోంది. కొన్ని పీహెచసీల్లో అవసరానికి మించి వైద్యులు ఉండగా మరికొన్ని దవాఖానల్లో ఉండాల్సిన దానికి కన్న తక్కువ వైద్యులు విధులు నిర్వర్తించడం వైద్య ఆరోగ్య శాఖ తీరు విస్మ యానికి గురి చేస్తోంది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు లేని సందర్భాల్లో రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. చాలా కాలంగా ఇదే తంతు కొన సాగు తున్నా అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఒకే మండలంలో 4 పీహెచసీలు.. 7గురు వైద్యులు
2011 జనాభా లెక్కల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా వలి గొండ మండలం 7 వేలకు పైగా జనాభా కలిగి ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మండలంలో ఒక 24 గంటల పీహెచసీతో పాటుగా మరో 3 పీహెచసీలు 12 గంటల వైద్య సేవలు అందిస్తున్నాయి. వలిగొండ మండల కేంద్రంలోని 24 గంటల పీహెచసీలో ఇద్దరు, వర్కట్‌పల్లి, వెల్వర్తి పీహెచసీలో ఒక్కొక్కరు, 12 గంటల వేముల కొండ పీహెచసీలో ముగ్గురు డాక్టర్లు పని చేస్తున్నారు. ఒకే మం డలం మొత్తం 4 ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాల్లో 7 గురు వైద్యులు, అందులో 12 గంటల ఆసుపత్రిలో 3 గురు డాక్టర్లు విధులు నిర్వి హస్తున్నారు.
దీర్ఘకాలంగా ఒకే ప్రాంతంలో విధులు..
జిల్లాలోని పలు పీహెచసీలో పని చేస్తున్న డాక్టర్లు, ఉద్యోగులు సిబ్బంది చాలాకాలంగా ఒకే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పీహెచసీకి పరిసరాల్లో వారి ప్రైవేటు ఆసుపత్రులు ఏర్పాటు చేసుకొని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కంటే వారి ప్రైవేటు ఆసుపత్రులకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు విమర్శలున్నాయి. పలు రకాల వ్యాధులతో ఆసుపత్రులకు వచ్చే పేద రోగులను వారి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లేలా సూచనలు చేస్తున్నట్ల్లు తెలుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో సర్కారు వైద్యానికి అత్యంత ప్రాధా న్యత ఇస్తున్న కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖపై దృష్టి సారించి పేదలకు వైద్యం అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
12 గంటల దవాఖానలో ముగ్గురు, 24 గంటలకు ఒక్కరే వైద్యుడు
యాదాద్రి భువనగిరి జిల్లాలో జిల్లా కేంద్ర ఆసుపత్రి, మూడు సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచసీ), 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచసీ), ఒక అర్బనఆరోగ్య కేంద్రం (యూపీ హచసీ), 4 బస్తీ దవాఖానాలతో పాటుగా 99 ఆయుష్మాన ఆరోగ్య కేంద్రాలు, 44 పల్లె దవాఖానాలు నిర్ణీత సమయాలతో జిల్లాలో వైద్య సేవలు అందజేస్తున్నాయి. వీటిలో 11 ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటల వైద్య సేవలు అందుతుండగా, 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 12 గంటల వైద్య సేవలు అందిస్తున్నాయి. 24 గంటల పీహెచసీలు భూదాన పోచంపల్లి, ఆత్మకూరు (ఎం),రాజాపేటలలో ఒక్కొక్కరు మాత్రమే విధులు నిర్వహి స్తుండగా, 7 కేంద్రాల్లో ఇద్దరు డాక్టర్ల చొప్పున, మోత్కూరు పీహెచసీలో ముగ్గురు డాక్టర్లు వైద్యసేవలు అందిస్తున్నారు. అదే 12 గంటల ఆసుపత్రులు వేములకొండ, తంగ డపల్లి ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాల్లో ముగ్గురేసి చొప్పున విధులు నిర్వ హిస్తున్నారు. 12 గంటలకు ముగ్గురు వైద్యులు ఉండి, 24 గంటలకు ఒక్కరే వైద్యుడు ఉండటం విస్మయం కలిగిస్తోంది.
వైద్య సేవలు అందడం లేదు
24 గంటల పీహెచసీ రాజాపేటలో ఒక్కరే వైద్యుడు విధులు నిర్వహిస్తుండటంతో సరిగ్గా ఆరోగ్య సేవలు అందడం లేదు. పేద ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులలోకి వెళ్తే ఆరోగ్య పరీక్షల పేరుతో డబ్బులు లాగుతున్నారు. రాజాపేట మండ లానికి అత్యవసర సేవలకు ఆలేరు, లేదా జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం ఇద్దరైనా వైద్యులు ఉంటే బాగుంటుంది. -గుంటి మధుసూదన రెడ్డి, జాల మాజీ సర్పంచ
సర్దుబాటు చేస్తాం
12 గంటల ఆసుపత్రులలో ఉన్న ముగ్గురేసి వైద్యులు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అపాయిం ట్‌మెంట్ జరిగింది. అందు లో జిల్లా వైద్యశాఖ ప్రమేయం లేదు. 24 గంటల ఆసుపత్రుల్లో ఒక్కరే ఉన్న వాటిలో సర్దుబాటు కింద వైద్యులను కేటాయిస్తాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు వైద్య సేవల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాము. -డాక్టర్ మనోహర్, డీఎంహెచవో, యాదాద్రి భువనగిరి జిల్లా